34.7 C
Hyderabad
May 5, 2024 01: 46 AM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో భారీ నిరసన ప్రదర్శన

#congresspartyprotest

పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ విద్యుత్ నిత్యావసర వస్తువుల ధరలు తక్షణమే తగ్గించాలని రాస్తారోకో

రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్,విద్యుత్,నిత్యావసర వస్తువుల ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఎఐసిసి పిలుపు మేరకు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ లో నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెసు పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేసి, భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు.

హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అదుపు లేకుండా పోయాయని, నెలలో 15మార్లు పెంచుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మధ్యతరగతి ప్రజల కుటుంబాలను అణగత్రొక్కుతున్నారని నిరుద్యోగ శాతం పెంచుతూ ఆత్మహత్యల భారతదేశం గా మారుస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తూ ధర్నాలు చేయటం చూస్తుంటే బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకరికొకరు దొంగల లాగా సహకరించుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం వెంకటరెడ్డి, చక్కెర వీరారెడ్డి,భూక్యా మంజూ నాయక్,భూక్యా గోపాల్,సాముల శివారెడ్డి,జయపాల్ రెడ్డి,నవీన్ నాయక్,సైదా మేస్త్రి,ఇంద్రారెడ్డి,సీతారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,బాచిమంచి గిరిబాబు,నాగయ్య, జక్కుల మల్లయ్య,ముశం సత్యనారాయణ,బెల్లంకొండ గురవయ్య, శివరాం యాదవ్,మేళ్ళచెరువు ముక్కంటి,పాశం రామరాజు, చింతకాయల రాము,రామ్మూర్తి,మొగిలి మట్టపల్లి,రహీమ్,వంటిపులి శ్రీను, యోహాను,లచ్చిమల్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావద్దు

Satyam NEWS

పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమం

Satyam NEWS

అక్సిడెంట్:గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం5గురి మృతి

Satyam NEWS

Leave a Comment