40.2 C
Hyderabad
April 29, 2024 15: 37 PM
Slider విజయనగరం

దిశ యాప్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌నకు పోలీసులే నేరుగా రంగంలోకి…!

#disaapp

గ‌రివిడి,గుర్ల‌,పూస‌పాటిరేగ ఎస్ఐలతో దిశ ఎస్ఓఎస్ తో ప్ర‌చారం

సీఎం జ‌గ‌న్ మాన‌సిక పుత్రిక్ అయిన దిశ‌. దీని కొర‌కు రాష్ట్ర బ‌డ్జెట్ లో అందునా పోలీస్ శాఖ ప‌రంగా కోటాను కోట్ల‌నే కేటాయించింది..జ‌గ‌న్ ప్ర‌భుత్వం.ప్ర‌త్యేకించి ఎం,ఎస్.పీ ల‌ను నియ‌మించిమ‌రీ  ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న నేరాల‌ను నియంత్రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లను చేప‌ట్టింది.ఇందుకోసం దిశ యాప్ ను ప్ర‌వేశ పెట్ట‌డంతో పాటు…దిశ మొబైల్ వాహ‌నాల‌ను కూడా ఆయా జిల్లాల‌కు పంపించింది..జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

అందులో భాగంగానే దిశ యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజ‌య‌న‌గ‌రం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపడు తున్నారు…ఎంఎస్పీలు.అలాగే   1,894 మంది  దిశా యాప్ ను తమ,త‌మ‌ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో దిశ  యాప్ ఇంత వరకు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 3,48,006 కు చేరింది.

జిల్లా వ్యాప్తంగా మహిళపై దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న 485 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, వాటిపై నిఘా ఏర్పాటు చేసి, ఆయా ప్రాంతాల్లో దిశా మొబైల్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేశారు. ప్ర‌త్యేకించి జిల్లాలో గరివిడి,,గుర్ల,పూస‌పాటిరేగ‌,విజ‌య‌న‌గ‌రం  రూర‌ల్ ఎస్ఐలు లీలావ‌తి,జ‌యంతి లాంటి మ‌హిళా ఎస్ఐల‌తో దిశ యాప్ ప‌ట్ల అవ‌గాహ‌న  క‌ల్పించే చ‌ర్య‌లు చేప‌డుతోంది..జిల్లా పోలీస్ శాఖ‌.

జిల్లా వ్యాప్తంగా నేర వార్త‌ల స‌మాహారం క్రైమ్ ఫటాఫ‌ట్ …!

మీ చుట్టూ జ‌రుగుతున్న నేర స‌మ‌చారాన్ని తెలుసుకోండి..వారి నివార‌ణ‌కు  పోలీస్ శాఖ ఏయే చ‌ర్య‌లు తీసుకుంటోందో..?  ఏయే సెక్షన్లు విధిస్తుందో  తెలుసుకునేందుకు  స‌త్యం న్యూస్.నెట్ అందిస్తోన్న నేర వార్త‌ల  స‌మాహారం క్రైమ్ ఫటాఫ‌ట్ ను చూడండి.ప్రజలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఏపీలోని విజ‌య‌న‌గ‌రం  జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసు అధికారులు కళాశాలలు, పాటశాలలు, ముఖ్య కూడళ్లను సందర్శించి, విద్యార్థినులు, మహిళల రక్షణకు దిశా యాప్ ఏవిధంగా ఉపయోగ పడుతున్నది వివరించి, వారి మొబైల్స్ లో దిశా యాప్ ను డౌన్లోడ్ చేయించి, రిజిస్ట్రేషన్ చేయించారు.

అలాగే విజిబుల్ పోలీసింగులో భాగంగా  వివిధ ప్రాంతాల్లో పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టి, రికార్డులు పరిశీలించి, పెండింగులో ఉన్న చలనాలను కట్టించండంతోపాటు, నిబంధనలు అతిక్రమించిన వారిపై కొత్తగా ఈ చలనాలను విధించారు.అదే విధఃగా రోడ్డు ప్రమాదాలు, జూదం, కోడి, గొర్రె పందాలు నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత ఖైనీ, గుట్కాలు, గంజాయి, ఇసుక, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు, కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపైన కఠిన చర్యలు చేపట్టారు.

మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు మరియు ఎస్ఈబీ పోలీసులు సంయుక్తంగా  రైడ్స్ నిర్వహించి, 5 కేసులు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 30.1 లీటర్ల నాటుసారాను, 2.34 లీటర్ల ఐ.ఎం.ఎల్.ఎఫ్. మద్యాన్ని  స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నాటుసారా తయారీకి సిద్దం చేసుకొన్న 200 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలు, డ్రమ్ములను ధ్వంసం చేశారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై  37 కేసులను పోలీసులు నమోదు చేశారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 30 కేసులను పోలీసులు నమోదు చేశారు.

Related posts

A big question: అందరూ అలక వీడినట్లేనా….?

Satyam NEWS

అక్షయ తృతీయ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు

Satyam NEWS

చ‌దువే అభివృద్దికి ఏకైక మార్గం

Satyam NEWS

Leave a Comment