27.7 C
Hyderabad
May 15, 2024 06: 54 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ లో బిసి విద్యార్ధులకు గ్రూప్ 1, 2, పోలీసు శిక్షణా తరగతులు

#nagarkurnoolcollector

తెలంగాణ లో జరగబోయే గ్రూప్  1, 2, కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించే ఈ శిక్షణా తరగతులలో పాల్గొనే వారికి ఉచిత శిక్షణ తో బాటు స్టైఫండ్ కూడా ఇస్తారని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ శిక్షణకు అభ్యర్ధులను అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అర్హత పరీక్ష్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఉదయం 11.00 నుంచి 12.30 వరకూ పరీక్ష ఉంటుంది. ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు ఈ అర్హత పరీక్ష కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. నమోదు చేసుకోవడానికి చివరి తేది 16 ఉదయం 10 గంటల లోపు గడువు ఉందన్నారు.

నమోదు చేసుకునేందుకు:

https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do

Use Unlock Code: UNACADEMY10

ఇతర వివరాలకు సంప్రదించండి: సెల్ నెంబర్ 7780359322

నాగర్ కర్నూల్ జిల్లా నుండి ఇప్పటి వరకూ 917 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని నాగర్ కర్నూలు జిల్లా వెనుకబడిన తరగతుల కులాల అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఈ ప్రకటనలో కోరారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

మునుగోడు గెలుపే లక్ష్యంగా పువ్వాడ దళం

Murali Krishna

అగ్లీ ట్రెడిషన్: గుజరాత్ లో మరో మారు కన్యత్వ పరీక్షలు

Satyam NEWS

సమాచార మంత్రికి టీడబ్ల్యూజేఎఫ్ నేతల అభినందనలు

Bhavani

Leave a Comment