37.2 C
Hyderabad
May 6, 2024 20: 53 PM
Slider ప్రత్యేకం

పుష్క‌ర కాలం కింద‌ట కేసుపై ఇప్పుడు కాంగ్రెస్ ద‌ర్నా చేయ‌డం హాస్యాస్ప‌దం…!

#ponguleti

దాదాపు  ప‌న్నెండేళ్ల క్రితం పెట్టిన కేసుపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయ‌డంలో అర్ధం లేద‌ని బీజేపీ నేత‌,త‌మిళ‌నాడు స‌హ ఇంచార్జ్ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి ఆక్షేపించారు.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,సోనియ గాంధీల‌పై ఉన్న నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు విష‌యంలో..ఆ పార్టీ హైద‌రాబాద్ లో ధ‌ర్నా చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. త‌ల కింద  త‌ప‌స్సు చేసినా….కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు…కేసు నుంచీ త‌ప్పించుకోలేద‌ని సుధాక‌రెడ్డి అన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియాగాంధీలకు నోటీసు ఇచ్జి మ‌రీ ఈడీ విచారణ చేస్తోందని…ఈ కేసు కొత్తగా పెట్టింది కాదు… ఇది 12 ఏళ్ల కిందటి కేసు.అని గుర్తు చేసారు..పొంగులేటి.కోర్టు ఆదేశాలతో ఈడీ నోటీసులిస్తే ఈ లొల్లి ఏందని… ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మీరే కడిగిన ముత్యంలా వస్తారు…?  తప్పు చేశామని కాంగ్రెసోళ్లే అనుకుంటున్నరు.

అందుకే ముందే. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోందని పొంగులేటి ఆరోపించారు.. ఇక ఖైరతాబాద్ లో కాంగ్రెసోళ్లు చేసిన విధ్వంసం,. వీళ్ల కేసుకు సంబంధించిన అంశానికి, సాధారణ ప్రజలకు సంబంధమేంటి..అస్స‌లు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం?   అంటూ ప్ర‌శ్నించారు.ఇక ఈ అల్ల‌ర్ల కేసు విష‌య‌లంలో కాంగ్రెస్,టీఆర్ ఎస్… ఇద్దరు కలిసి బీజేపీని బదనాం చేసేందుకు ఇదో కొత్త డ్రామా షురూ.. చేశారని సుధాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేసారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పక్కా దోస్తీ ఉందని… వారిద్దరూ కలిసే ఇదంతా చేస్తున్నరని…. కాంగ్రెసోళ్లు 50 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించారు. చట్టాన్ని గౌరవించడం వారికి తెలియ‌దా..? ఈడీ, సీబీఐ అధికారులు వాళ్ల డ్యూటీ చేయొద్దా?  గతంలో  మోడీ పై కేసులు పెట్టారు. విచారణ చేశారు.

అమిత్ షా ని జైళ్లో పెట్టారు. అద్వానీ పై కేసులు పెట్టారు. మీలాగా చేతగానోని లెక్క రోడ్ల మీదకొచ్చి లొల్లి చేశామా..? బీజేపీ ధైర్యంగా  విచారణను ఎదుర్కొని…. కడిగిన ముత్యంలా  బయటకు వచ్చామ‌న్నారు.  దేశవ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరుతోంది. తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరేయబోతున్ద్నాం…అందుకే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు వణుకుపుట్టి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

త్వరలో రెండు పార్టీలు కలిసి తెలంగాణలో, దేశంలో కూడా అరాచకాలు చేయబోతున్నార‌ని…. బీజేపీని బదనాం చేసేందుకు పెద్ద పెద్ద కుట్రలు చేయబోతున్నార‌ని పోలీసుల‌ను  అలెర్ట్ చేసారు..బీజేపీ తమిళ‌నాడు స‌హ ఇంచార్జ్ పొంగులేటి.

Related posts

కఠిన చర్యలు తీసుకోకుంటే.. మూడో వేవ్

Sub Editor

ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతర కృషి

Satyam NEWS

వనజీవి రామయ్య కుమారుడు మృతి

Bhavani

Leave a Comment