40.2 C
Hyderabad
April 29, 2024 15: 53 PM
Slider ముఖ్యంశాలు

దళిత బాలికపై వేధింపులకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

#malamahanadu

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ హైదరాబాదులోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోకిరి దళిత బాలికను ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తే దానిని బాధిత తండ్రి జూన్ 2న సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిపారు.

దాన్ని పట్టించుకోకుండా చందానగర్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి నిందితుడు అరవింద్ పైన కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కాక ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి పైన కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేశారని ఆయన తెలిపారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులు చట్ట వ్యతిరేకంగా బాధిత తండ్రిని కొట్టడం సిగ్గుచేటన్నారు. నిందితుడు అరవింద్ తండ్రి నాగేశ్వరరావు తన కొడుకు మీద ఫిర్యాదు చేసిన దళిత బాలిక తండ్రి బైక్ ను నిప్పు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఒకపక్క నిందితుడు ఒక దళిత బాలికను లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే, దాన్ని నివారించాల్సిన తండ్రి దళిత బాలిక తండ్రి బైకు తగలబెట్టి బెదిరింపులకు పాల్పడిన నాగేశ్వర రావు పైన చర్యలు తీసుకోకుండా దళిత బాలిక తండ్రిని విచక్షణ రహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. బాధిత కుటుంబ సభ్యులు పై అధికారుల దృష్టికి తీసుకొచ్చిన నిమ్మకు నీరెక్కనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన తెలిపిన తర్వాతనే నిన్న నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు, లైంగిక వేధింపులకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. బాధిత తండ్రిని కొట్టిన ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితుడు అరవింద్ తండ్రి నాగేశ్వరావు ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్,జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యాంసుందర్, జిల్లా సహాయ కార్యదర్శి బ్యాగరి వెంకటేష్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు దూలకాడి చెన్నయ్య, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉక్రెయిన్ – రష్యా: యుద్ధం ఆరంభం అయినట్లేనా….?

Satyam NEWS

విధినిర్వహణలో మానవత దృక్పథంతో మెలగాలి

Satyam NEWS

మాజీ ఎంపీపీ దశదిన కర్మ కు హాజరైన నాయకులు

Satyam NEWS

Leave a Comment