40.2 C
Hyderabad
May 2, 2024 15: 45 PM
Slider మహబూబ్ నగర్

పానగల్ మండలంలో స్వీట్లు పంచిన కాంగ్రెస్ యూత్

#pangalmandal

దీపావళి పర్వదినం సందర్భంగా ప్రముఖులకు స్వీట్లు పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు వనపర్తి జిల్లా పానగల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు.

పానగల్ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం, యంపిడివో కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి లలో కొల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యండి వహీద్, పానగల్ మండల యువజన కార్యకర్తలు ఉత్సాహంగా తిరుగుతూ స్వీట్లు పంచి పెట్టారు. అక్కడి అధికారులకు, సిబ్బందికి స్వీట్లు పంచి పెట్టి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియచేశారు.

అదే విధంగా యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేన వనపర్తి జిల్లా లో ఉన్న అన్ని మండలాలకు సంబంధించిన కార్యాలయాలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ లాలయ్య, యూత్ నాయకులు నగేష్, వరుణ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

చీమలపాడు ఘటనపై సీఎం కేసీఆర్ సంతాపం

Satyam NEWS

చెప్పిన పంటలు సాగు చేయకపోతే రైతుబంధు ఇవ్వరా?

Satyam NEWS

పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment