30.7 C
Hyderabad
May 5, 2024 06: 03 AM
Slider నల్గొండ

కానిస్టేబుల్ యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలి

#congressparty

జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన ఎండి.అజీజ్ పాషా

తెలంగాణలో రాబోయే భారీ పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్ పోస్టుల నోటిఫికేషన్ కు వయోపరిమితి పెంచాలని టి.పిసిసి జాయింట్ సెక్రటరీ మహ్మద్ అజీజ్ పాషా అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ వెయ్యలేదని,కనుక పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి కనీసం 5 సంవత్సరాలు పెంచాలని కోరారు.

గ్రూప్ 1 డిఎస్పీ ఉద్యోగాలకు కనీస ఎత్తు 167.7 సిఎం నుండి 165 సిఎం  లకు తగ్గించాలని అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండీ.అజీజ్ పాషా పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ యు పి ఎస్ సి పరీక్షల్లో ఐపిఎస్ లకు కుడా 165 సిఎం ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం 167.7 సిఎం ఎందుకో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు.సర్వీసులో ఉన్న ఉద్యోగులకు అవసరం లేకున్నా 3సంవత్సరాల వయోపరిమితి పెంచారని,యూనిఫాం పోస్టులకు వయోపరిమితి పెంచకపోతే ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అజీజ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న యూనిఫాం నిరుద్యోగులకు మాత్రం  5 సంవత్సరాలు పెంచితే వచ్చిన ఇబ్బంది ఏంది అని ప్రశ్నించారు.కరోనా మహమ్మారి వల్ల నోటిఫికేషన్లు  రాకపోవడంతో నిరుద్యోగులు నిరీక్షణ తోనే కాలం వెళ్ళబుచ్చారని,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న యూనిఫాం నిరుద్యోగులకు వయో పరిమితిని 5 సంవత్సరాలకు పెంచి న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారని,ప్రభుత్వ నోటిఫికేషన్లు వస్తాయని ఎన్నో వ్యయ ప్రయాసలతో కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి సకాలంలో నోటిఫికేషన్లు రాక వచ్చిన నోటిఫికేషన్లకు వయోపరిమితి మించి పోయిన నిరుద్యోగులను యూనిఫాం పోస్టులకు వయోపరిమితి పెంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి వయో పరిమితి పెంచేందుకు కృషి చేయాలంటూ కలెక్టర్ కి ఇచ్చిన వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగితే?

Satyam NEWS

అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి

Satyam NEWS

Leave a Comment