32.2 C
Hyderabad
May 2, 2024 00: 50 AM
Slider వరంగల్

ములుగు జిల్లా కు చెందిన కళాకారునికి జాతీయ స్థాయి ఘంటసాల అవార్డు ప్రధానం

#ghantasala

పద్మశ్రీ ఘంటసాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అర్ట్స్ లెర్నీనిగ్ వారు ఆన్లైన్ ఘంటశాల పాటల పోటీలను గత వారం కిందట నిర్వహించగా ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన కళాకారుడు  మహ్మద్ రహిమ్ మొద్దిన్ బంగారు పతకం సాధించారు.

ఈ పోటీలలో పాల్గొన్న వారిలో 100 మంది కళాకారులను ఎంపిక చేయగా ఇందులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చెన్నై నగరాల నుండి అనేక మంది గాయనీ, గాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి హాజరై పాటల పోటీలలో పాల్గోన్న వారిలో 100 మంది ఉత్తమ కళాకారులను ఎంపిక చేసి ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున శత గాయక సమ్మేళన కార్యక్రమాన్ని హుస్నాబాద్ లో నిర్వహించారు.

ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ సంస్థ అధ్యక్షులు నాదమునుల రామారావు, కార్యాదర్ళి శ్రీమతి అబినందన సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే  ఓడితల సతీష్ గారి చేతుల మీదుగా ములుగు జిల్లా కు చెందిన కళాకారుడు రహీమ్ మొద్దీన్ సన్మానించి బంగారు పతకంతో పాటు జ్ఞాపికను బహూకరించారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి రహీమ్ మొద్దిన్ ఎంపిక కావడం ఈ సందర్భంగా పలువురు కళాకారులు అమినందనలు తెలుపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు రమేష్ రాజా, ప్రముఖ సిని, టీవీ నటి మహతి, తెలంగాణ ఉద్యమకారులు మరియు రచయిత గాయకులు మురళీధర్ దేశ్ పాండే పాల్గొని స్థానిక కళాకారుడు రహీమ్ మొద్దిన్ ను ప్రశంసించారు. పౌరసంబంధాల శాఖ సాంస్కృతిక సారధి సభ్యులుగా ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి పథకాల పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూన్నరహీమొద్దిన్ రాష్ట్ర, జాతీయ స్థాయి కళాకారుడిగా ఎదిగినప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం రహీమ్ మొద్దిన్ కు డబల్ బెడ్ రూం ఇస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తోటి కళాకారులు కోరుకుంటున్నారు.

Related posts

జగన్ చేసిన మరో మోసం బట్టబయలు

Satyam NEWS

వీరపల్లె లో భత్యాల చీరలు దుప్పట్లు పంపిణీ

Satyam NEWS

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ కవ్వంపల్లి ఖరారు

Satyam NEWS

Leave a Comment