29.7 C
Hyderabad
May 4, 2024 03: 37 AM
Slider నిజామాబాద్

మన రాజ్యాంగాన్ని పౌరులు అందరు గౌరవించాలి

#ConstitutionDay

భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవం కామారెడ్డి జిల్లా బిచ్కుందలోరి బోర్లమ్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ  DSP జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.

అనంతరం భారత రాజ్యాంగం పీఠికను చదివి అందరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా DSP జైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశ పాలన రాజ్యాంగాంన్ని అనుసరించే జరుగుతుందని అందువల్ల అందరూ దానిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మేధావి Dr బాబాసాహెబ్ అంబెడ్కర్ ప్రపంచ మేధావి గా గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. అంతటి గొప్ప మేధావి తన జ్ఞానాన్ని ఉపయోగించి, స్త్రీలకు చదువుకొనే హక్కు, కుల, మత, పేద ధనిక,లింగ బేధం లేకుండా అందరికి ఓటు హక్కు, సమానత్వపు హక్కు కల్పించారని అన్నారు.

అన్ని కులాలవారికి రిజర్వేషన్ వచ్చిందంటే కేవలం బాబాసాహెబ్ అంబెడ్కర్ వల్లనేనని ఆయన తెలిపారు. తాను కూడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని ఆయన విద్యార్ధులకు చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరళ శ్రీనివాస్ రెడ్డి, TRS నాయకులు దేవేందర్ రెడ్డి, మాజీ MPTC మన్నే విఠల్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రజనీకాంత్, అయ్యల సంతోష్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్,సరిత,మహేష్ శ్రీనివాస్ గౌడ్,గంగాధర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పిట్లంలో జ్యోతిబా పూలే 196 వ జయంతి వేడుకలు

Satyam NEWS

వరదకు కొట్టుకుపోయిన సోదరుల్లో ఒకరి మృతదేహం లభ్యం

Satyam NEWS

ఆదిలాబాద్ రూరల్ జడ్పిటిసి బరిలో రాజన్న తనయుడు

Satyam NEWS

Leave a Comment