42.2 C
Hyderabad
May 3, 2024 15: 10 PM
Slider ప్రత్యేకం

సంచలనం సృష్టించిన గంధం చంద్రుడు…. విశాఖ పోస్టింగ్

#gandham chandrudi IAS

గంధం చంద్రుడు… బహుశ ఈ పేరు తెలియని వాళ్లు ఆంధ్రప్రదేశ్ లో ఉండరు. అనంతపురం జిల్లా కలెక్టర్ గా పని చేసిన గంధం చంద్రుడును ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలె పొగిడారు కూడా. ఆయన ఎంతో బాగా పని చేస్తున్నారని చెబుతూ ‘‘కీప్ ఇట్ అప్ చంద్రుడు’’ అని ముఖ్యమంత్రి ఎంతో ఆప్యాయంగా చెప్పారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనకు అక్కడ నుంచి బదిలీ అయింది. గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గా గంధం చంద్రుడిని నియమించగా ఆయన ఆ పోస్టులో చేరలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

ఆ తర్వాతి రోజు ఆయనను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తగాదాలు పెట్టుకున్న గంధం చంద్రుడు తనకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నందున తనను ఎవరూ ఏం చేయలేరని బహిరంగంగానే చెప్పేవారు.

ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నందున ఆయన విశాఖ కలెక్టర్ గా పోస్టింగ్ తెచ్చుకున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. విశాఖ కలెక్టర్ గా గంధం చంద్రుడు నియామకం వార్త వాట్స్ యాప్ లో నేరుగా విశాఖ కలెక్టర్ కే చేరుకుంది. ఆయన ఆర్డర్ ఎప్పుడు వచ్చిందో వాకబు చేసుకోవాల్సి వచ్చింది.

కథ అంతటితో ఆగలేదు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెళ్లింది. ఐఏఎస్ అధికారులను నేరుగా పర్యవేక్షించే బాధ్యత ఉన్న ఆయనే ఇది నిజమా అని విచారణ చేసుకోవాల్సి వచ్చింది. అంతే కాదు. చాలా మంది ఐఏఎస్ అధికారులకు కూడా వాట్స్ యాప్ మెసేజి చేరింది.

ఫేస్ బుక్ లో ఈ వార్త మారుమోగిపోయింది. గంధం చంద్రుడు అభిమానులు ఎంతో సంతోషంతో ‘‘టైగర్ ఈజ్ బ్యాక్’’ అనే ట్యాగ్ లైన్ తో ట్రెండింగ్ చేశారు. గంధం చంద్రుడు లాంటి నిజాయితీ పరుడైన అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపడేమే తప్పని, ఇప్పటికైనా సరైన పోస్టింగ్ ఇచ్చారని గంధం చంద్రుడు అభిమానులు పుంఖాను పుంఖాలుగా పోస్టింగ్ లు పెట్టారు.

విశాఖ కలెక్టర్ గా గంధం చంద్రుడు వస్తున్నారని తెలిసిన ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చే విభాగానికే పెద్ద వార్త అయి కూర్చున్నది గంధం చంద్రుడు విశాఖ కలెక్టర్ అప్పాయింట్ మెంట్. ముఖ్యమంత్రి పేషీ వారు కూడా కంగారు పడి ఇది నిజమా అని వాకబు చేసుకోవాల్సి వచ్చింది.

అసలు ఈ వార్త ఎక్కడ నుంచి పుట్టింది? ఎలా పుట్టింది? ఎవరు పుట్టించారు? అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున అధికారి  పోస్టింగ్ పై సంచలనం కలగడం వారినే ఆశ్చర్య పరిచి విచారణ జరిపారు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షలాది మంది షేర్ చేసుకున్న ఈ సమాచారం ఎక్కడ నుంచి పుట్టిందో పోలీసులు కనిపెట్టారు.

సర్వ శిక్షా అభియాన్ లో పని చేస్తూ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు డెప్యుటేషన్ పై వెళ్లిన ఒక వ్యక్తి ఈ సమాచారం ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి నుంచి వచ్చిన పోస్ట్ ను ‘‘అధికార మీడియా’’లో ఉన్న కొందరు ఉత్సాహవంతులు మరింత ఉత్సాహంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని కూడా పోలీసులకు తెలిసింది.

అధికార మీడియాకు చెందిన వ్యక్తులే పోస్టింగ్ లు పెట్టడంలో ప్రజలు చాలా మంది దీన్ని నిజమని నమ్మారు. కొందరు మాత్రం దీనికి సంబంధించిన జీవో కాపీ ఉంటే షేర్ చెయ్యండి అంటూ అనుమానం వ్యక్తం చేసినా గంధం చంద్రుడు అభిమానులు చేసిన ప్రచారం ముందు ఇలా అడిగిన వారిని ఎవరూ పట్టించుకోలేదు. గంధం చంద్రుడు అప్పాయింట్ మెంట్ పై ఇంతలా ప్రచారం కావడంపై కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు.

ప్రభుత్వాన్ని నడిపేందుకు పని చేయాల్సిన మనం ఇలా వ్యక్తిగత ప్రచారానికి పాల్పడటం సీరియస్ గా తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అసలు ఈ వార్తను ఎవరు పుట్టించారనే విషయంపై పోలీసులు అనధికారికంగా మరింత లోతైన విశ్లేషణ చేస్తున్నట్లు చెబుతున్నారు.

చేసిన వారూ చేయించుకున్న వారూ కూడా అధికార కేంద్రానికి దగ్గరగా ఉండేవారే కాబట్టి ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చునని కూడా మరి కొందరు అంటున్నారు.

Related posts

రైతుల పేరెత్తే అర్హతే జగన్ రెడ్డికి లేదు

Bhavani

వీఎంసీ ఎదుట ఏపీ మున్సిప‌ల్ కార్మికు ల ధ‌ర్నా

Satyam NEWS

On line casino First Canada Assess Sign in & Take up With regard to $1 First deposit

Bhavani

Leave a Comment