29.7 C
Hyderabad
May 2, 2024 04: 06 AM
Slider విజయనగరం

వీఎంసీ ఎదుట ఏపీ మున్సిప‌ల్ కార్మికు ల ధ‌ర్నా

#vijayanagaram

స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాల్సిందేన‌ని. .ఏపీ మున్సిప‌ల్ వ‌ర్కర్స్ యూనియ‌న్, అనుబంధ విభాగం  ఏఐటీయూసీ  .విజ‌య‌న‌గ‌రంలో డిమాండ్ చేసింది.. ఈ  మేర‌కు జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌గ‌నం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎదుట ఏఐటీయూసీ అనుబంధ  విభాగం ఏపీ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ ధ‌ర్నా నిర్వ‌హించింది.

ఈ ద‌ర్నా నుద్దేశించి  ఏఐటీయూసీ జిల్లానేత  బుగ‌త అశోక్ మాట్లాడుతూ…సీఎం జ‌గ‌న్ అడ్డ‌దారుల్లో తెచ్చిన జీఓల ఆధారంగా కార్మికుల వేత‌నాలు పెంచాల‌న్నారు. మున్సిప‌ల్ కార్పొరేష‌న్  పెండింగ్  బ‌కాయిలు, వేతనాలు,ఫించ‌న్ల‌ను తక్ష‌ణం మంజూరు చేయాల్సిందేనంటూ ఆసంఘం నేత బుగ‌త అశోక్  డిమండ్ చేసారు.

పీఆర్సీ జీఓ  151 జీఓ ప్ర‌కారం  కార్మికుల‌కు  24వేలు జీతాలుఇవ్వ‌కుడా 3,500 ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌న్నారు.త‌క్ష‌ణం  86 ల‌క్ష‌ల పీఎఫ్ బ‌కాయిల‌ను చెల్లించాల‌ని డిమాండ్ చేసారు. 15 ల‌క్ష‌ల కార్మికులేన‌ని సీఎం జ‌గ‌న్ మిన్న‌కుంటే  ఆ కుటుంబాల‌లో  ఒక్కొక్కొరు క‌లిసి ప్ర‌భుత్వంపై ముప్పేట దాడికి దిగితే ప్ర‌భుత్వ అడ్ర‌స్ గ‌ల్లంతుఅవుతుంద‌ని  అశోక్ హెచ్చ‌రించారు.

త‌క్ష‌ణం పెండింగ్ బ‌కాయిలు,పెండింగ్ వేత‌నాల‌ను చెల్లించి మున్సిప‌ల్ కార్మికుల‌ను ఆదుకోవాల‌ని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తోంద‌న్నారు. ధ‌ర్నానుద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, రంగ‌రాజు మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్… ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో ఉద్యోగులకు కార్మికులకు తల మీద చేయి వేసి ఇచ్చిన హామీలను తుంగలోకితొక్కార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అది భస్మాసుర హస్తమని ఉద్యోగ, కార్మికులకి నేటికి అర్ధమైందని విమ‌ర్శించారు.అనంత‌రం  క‌మీష‌న‌ర్ ను క‌లిసి విన‌త్రి ఇచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో  యూనియన్ జిల్లా అధ్యక్షుడు జలగడుగుల కామేష్, ఉపాధ్యక్షుడు తుపాకుల శ్రీను, సహాయ కార్యదర్సులు కళ్యాణ్ శ్రీను, దాలయి శ్రీను, పి.కిషోర్, సత్తిబాబు, ధనరాజ్, పి.శ్రీను, సిహెచ్ మహేష్, బండి రాము, కె.చిరంజీవి కార్మికులు పాల్గొన్నారు.

Related posts

ఆపర్చునిటీ:నిర్భయ దోషుల ఉరిశిక్షపై కోర్టు స్టే

Satyam NEWS

డాక్టర్ చదలవాడ ను పరామర్శించిన మాజీ మంత్రి కాసు

Bhavani

నాగర్ కర్నూల్ లో 27వ తేదీ నుంచి ప్రజావాణి పునః ప్రారంభం

Satyam NEWS

Leave a Comment