28.7 C
Hyderabad
April 26, 2024 09: 53 AM
Slider నెల్లూరు

రైతుల పేరెత్తే అర్హతే జగన్ రెడ్డికి లేదు

రైతు భక్షక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు మారాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 40.31 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లే తక్కువ అనుకుంటే ఈ ఏడాది ఖరీఫ్ లో 34 లక్షలకే పరిమితం చేయడం దుర్మార్గం అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఏపీ ఉందని ఆయన తెలిపారు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ లో 30 శాతం మాత్రమే ఖర్చుపెడుతున్నారని, వ్యవసాయ సమీక్షలో మాత్రం జగన్ రెడ్డి ఊదరగొడతారు. కానీ చెప్పేదొకటి, చేసేదొకటి. ధాన్యానికి మద్దతు ధర లభించక రైతులు తెగనమ్ముకుంటున్నారు. ధాన్యం టన్నుకు రూ.20,400, క్వింటా రూ.2,040 మద్దతు ధర ఉంది. టన్నుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు తక్కువకు రైతులు తమ ధాన్యం అమ్ముకునే పరిస్థితి దాపురించిందని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ రెడ్డి ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు 6 నెలల వరకు చెల్లించడం లేదు. చంద్రబాబు నాయుడి హయాంలో ఏడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించాం.

తెలంగాణలో మూడో రోజే డబ్బులు వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో ధాన్యం సేకరణ 34 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యంగా పెట్టారు. గతేడాది ఖరీఫ్ లో 40.31 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ కి 34 లక్షలకే పరిమితం చేశారు. తెలంగాణ గతేడాది ఖరీఫ్ లో 70 లక్షల టన్నులు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఖరీఫ్ లో కోటి టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.20 వేల కోట్లు రైతులకు చెల్లించడానికి సిద్ధం చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి అధికారికంగా చెప్పారు. జగన్ రెడ్డి గతేడాది ఖరీఫ్ లో 40 లక్షల టన్నులు కొంటే ఈ ఏడాది ఖరీఫ్ లో 60 లక్షల టన్నులకు పెంచాల్సింది పోయి 34 లక్షల టన్నులకు తగ్గించారని సోమిరెడ్డి

చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మిల్లింగ్ ఛార్జీలు, ట్రాన్స్ పోర్ట్ ఛార్జీల కింద ఒక్క నెల్లూరులోనే రూ.247 కోట్లు, గోదావరి జిల్లాల్లో రూ. 900 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ జగన్ రెడ్డి హయాంలోనివే. రవాణ, గోనెసంచులు, హమాలీల ఖర్చులు మావే అంటూ పెద్దపెద్ద హోర్డింగ్ లు పెట్టే జగన్ రెడ్డి.. జరుగుతున్నదేమిటి? వరి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఆయన అన్నారు. రేషన్ బియ్యం బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తూ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. కాకినాడ, కృష్ణపట్నం పోర్ట్ నుంచి రేషన్ బియ్య పెద్దఎత్తున ఎగుమతి జరుగుతోంది అని ఆయన ఆరోపించారు.

ప్రకటనల్లో పచ్చి మోసం

అక్టోబర్ 17న జగన్ రెడ్డి ఇచ్చిన యాడ్ లో 1.33 లక్షల కోట్లు వ్యవసాయ పథకాలకు ఖర్చు పెట్టామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రూ.45,899 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.7,156 కోట్లు.. అంటే దాదాపు రూ.53 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇది రైతుల కోసం ఖర్చా? ఇదేమైనా దానమా? మీరు మిల్లింగ్ చేసుకోవడం లేదా, ఎఫ్ సీఐకి అమ్ముకోవడం లేదా, సివిల్ సప్లైయి కోసం వాడుకోవడం లేదా? ఈ విధనమైన ప్రకటనలు రైతులను అవమానించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదు..ఆయన చేస్తున్నది పచ్చి మోసం. ఆక్వాపై కమిటీ వేసింది మోసం, ప్రతి గింజా కొంటామని చెప్పడం మోసం, ధరల స్థిరీకరణ నిధి మోసం. రైతుల పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదు. రైతులు సర్వనాశనం అయ్యారు. మైక్రో ఇరిగేషన్, యాంత్రీకరణ ఎందుకు అపేశారు? మేం 2017-18 ఒక్క ఏడాదే మైక్రో ఇరిగేషన్ కు రూ.1250 కోట్లు ఖర్చు చేస్తే.. ఎందుకు ఆపేశారు. యాంత్రీకరణ, రైతు రథం కలిపి 2017-18లో రూ.650 కోట్లు ఖర్చు పెడితే ఎందుకు ఆపేశారు? వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

నా భర్త నాతో కాపురం చేయడం లేదు సార్

Satyam NEWS

కొల్లాపూర్ గాంధీ హై స్కూల్ లో ఘనంగా నవంబర్14

Satyam NEWS

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అర్నబ్ గోస్వామి

Satyam NEWS

Leave a Comment