40.2 C
Hyderabad
May 6, 2024 15: 47 PM
Slider ముఖ్యంశాలు

పోక్సో చట్టం కింద నిందితుడి కి 20 ఏళ్ల జైలు శిక్ష…!

#depikaips

విజయనగరం జిల్లా దిశ మహిళా పోలీసు స్టేషనులో 2021 సెప్టెంబర్ 21వ తేదీ న నమోదైన పోక్సో కేసులో నిందితుడైన గంట్యాడ మండలం కొర్లాం కు చెందిన కారు చిన్నారావు (33 )కు 20సం.లు జైలు, 16 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శిక్ష విధిస్తూ  తీర్పు వెల్లడించిందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. నిందితుడు కారు చిన్నారావు మైనరు బాలికను ట్యూషన్లు పేరుతో మోసం చేసి, లైంగిక నేరంకు పాల్పడడంతో దిశ మహిళా పోలీసు స్టేషనులో 2021లో పోక్సో చట్టం ప్రకారం కేసును ఎస్ఐ కే.టి.ఆర్.లక్స్మి నమోదు చేసారన్నారు.

అనంతరం, దిశ మహిళ పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్ దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రస్తుత దిశ డిఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఆధారాలను ప్రవేశ పెట్టడంతో నిందితుడిపై నేరం నిరూపణయ్యిందన్నారు. ఈ కేసులో స్పెషల్ జడ్జి ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ సెల్ మరియు ఇన్చార్జ్ పోక్సో కోర్టు ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి షేక్ సికిందర్ భాషా నిందితుడు కారు చిన్నారావుకు 20 ఏళ్ళు జైలు శిక్ష,16వేలు జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీఎం. దీపిక తెలిపారు.

అంతేకాకుండా, బాధితురాలికి  5లక్షలు పరిహారాన్ని న్యాయమూర్తి మంజూరు చేసారన్నారు. ఈ కేసులో పోలీసువారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం. శంకరరావు వాదనలు వినిపించగా, దిశ స్టేషను కోర్టు హెడ్కానిస్టేబులు దివ్యజ్యోతి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించారు.

Related posts

మట్టిలో మాణిక్యం: చంద‌లాపూర్ యువ‌కుడు సుమంత్ శర్మ

Satyam NEWS

ఏపీ సీఎం జగన్ ని దూషించిన ఏ ఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

Bhavani

ఇంకా రోడ్డు సౌకర్యం లేదు…. సిగ్గు సిగ్గు

Satyam NEWS

Leave a Comment