37.2 C
Hyderabad
May 6, 2024 12: 53 PM
Slider విజయనగరం

విజయనగరం లో అర్ధరాత్రి పోలీసుల అలజడి….!

#cordenandscarch

విజయనగరం జిల్లా ప్రశాంతత కూ మారుపేరు గాంచినది. రెండు దశాబ్దాల కిందట సాలూరు కోర్ట్ లో సీఐ గాంధీ ని హత్య ఘటనతో ఒక్క సారి ఉలిక్కి పడటం తప్ప..ఇంతవరకు అలాంటి ఘటనలు కలిగి సంచలనం మాత్రం జరగలేదని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే కరోనా తర్వాత మాత్రం… గంజాయి రవాణా కు విజయనగరం జిల్లా మాత్రం అపఖ్యాతి మూపకట్టుకుంది. తదనంతరం… దానిపైన పోలీసులు దృష్టి సారిస్తూ వస్తున్పారు. తాజాగా జిల్లా ఎస్పీ దీపిక ఆకస్మిక తనిఖీలు, కార్డ్ ఆన్ సెర్చ్ అలాగే ఆపరేషన్ నైట్ స్టార్మింగ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం తో విజయనగరం సబ్ డివిజన్ పరిధి…వన్ టౌన్ ,రూరల్ పోలీసులు ఆ పనిలో పడ్డారు.

ఇటీవలే వన్ టౌన్ పరిధిలో సీఐ డా.వెంకటరావు… పదిమంది ఎస్ఐ లతో ఆపరేషన్ నైట్ స్టార్మింగ్ చేపట్టడంతో ఈ రోజు  అర్ధరాత్రి..రూరల్ పోలీసులు… సీఐ టీ.తిరుపతి రావు ఆధ్వర్యంలో… ఎస్ఐ లు..ఎస్టీఎఫ్ సిబ్బంది తో రూరల్ పరిధిలో… వీటీ అగ్రహారం, బియ్యాలపేట ,చెల్లూరు…వై జంక్షన్ ,ద్వారపూడి , తదితర ప్రాంతాల్లో… ఆపరేషన్ నైట్ స్టార్మింగ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో..దాదాపు ఇరవై మంది ని..అదుపులో తీసుకున్నారు… పోలీసులు.

ఈ సందర్భంగా “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి తో సీఐ తిరుపతి రావు మాట్లాడుతూ… ఎస్పీ ఆదేశాల మేరకు ఆపరేషన్ నైట్ స్టార్మింగ్ చేపట్టామన్నారు. ఈ ఆపరేషన్ లో విస్తరణ తనిఖీ లం ,మద్యం అక్రమ రవాణా, గంజాయి స్మగ్లింగ్, పేకాట వంటి నేరాలపై దృష్టి పెట్టడంతో… దాదాపు 20 మంది ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

Related posts

12న వస్తున్న మాచర్ల నియోజకవర్గం

Satyam NEWS

హత్యాయత్నం కేసును గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

Bhavani

బీజేపీకి సాయం చేస్తున్న రేవంత్ రెడ్డి

Bhavani

Leave a Comment