39.2 C
Hyderabad
May 3, 2024 11: 15 AM
Slider సంపాదకీయం

బీజేపీకి సాయం చేస్తున్న రేవంత్ రెడ్డి

#Revanth Reddy

బీజేపీ కోరిక తీర్చేందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. తన పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తున్నదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కొందరు ఎమ్మెల్యేలకు బీజేపీ వలపన్నిందని చెప్పడం, దాన్ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పడం కూడా తెలిసిందే. ఈ అంశంపై సిట్ దర్యాప్తు చేస్తుండగా అందుకు భిన్నంగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడమనే కీలక పరిణామం కూడా జరిగింది.

హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినా కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించడంతోనే రాష్ట్రంలో చకచకా పలు పరిణామాలు జరిగాయి. ఒక్కో ఎమ్మెల్యేను వంద కోట్లకు కొనుగోలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దాంతో ఇంత పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారే అంశంపై ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో సంచలన విషయాన్ని తెరపైకి తెచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా సీఎం కేసీఆర్ కొనుగోలు చేశారని, అందువల్ల ఆ వ్యవహారంపై కూడా తాము దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ పలు రకాల హామీలు ఇచ్చి తన పార్టీలో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణ. దీనికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారు.

ఈ మొత్తం ఆధారాలతో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారు. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి ఫిర్యాదును కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వీకరించేందు పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసినా, బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కూడా తప్పే. అందువల్ల రేవంత్ రెడ్డి చేసే ఫిర్యాదుపై పూర్తి దర్యాప్తు చేస్తే సీఎం కేసీఆర్ కేసులో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్ ) లో చేరిన ఎమ్మెల్యేల ఆస్తులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి.

ఎలా పెరిగాయనే అంశం పక్కన పెడితే రెండు మూడేళ్లలో భారీ ఎత్తున ఆస్తులు పెరగడం అంటే వారికి అధికార పార్టీ నుంచి ఏదో మేలు జరిగి ఉంటుందనే విషయం నిరూపించడం పెద్ద కష్టమైన పని కాదు. పైగా రేవంత్ రెడ్డి తగిన ఆధారాలతోనే ఫిర్యాదు చేస్తారు కాబట్టి దర్యాప్తు సంస్థలకు కూడా సులభం అవుతుంది. రేవంత్ రెడ్డి ఫిర్యాదును అందిపుచ్చుకుంటే కేసీఆర్ పై బీజేపీ చేస్తున్న యుద్ధం సులభం అవుతుంది. ‘‘ఫామ్ హౌస్ కేసు’’ తేలేలోపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేసినట్లు నిరూపణ అయితే బీజేపీ ఆశించింది జరుగుతుంది. అందుకే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు బీజేపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారనే విషయం చర్చలోకి వచ్చింది.

Related posts

పల్లా కు పట్టం కడతామని పట్టభద్రుల తీర్మానం

Satyam NEWS

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రారంభం

Satyam NEWS

బలహీనుల కోసం పోరాడేదే సీపిఐ పార్టీ

Satyam NEWS

Leave a Comment