28.7 C
Hyderabad
May 6, 2024 07: 15 AM
Slider వరంగల్

వెంకటాపూర్ లో 20 మందికి బిసి బందు చెక్కుల పంపిణీ

#bcbandhu

ములుగు జిల్లాలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు, వెంకటాపూర్ బీసీ కులస్తులకు 20 మందికి బిసి బందు చెక్కులను రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమశాఖల  మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు.  ఒకరికి  5 లక్షల రైతు బంధు చెక్కులను కూడా పంపిణీ, గత నెలలో భారీ వర్షాల కారణంగా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామస్తులు వరదల్లో చిక్కుకొని 8మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున  చెక్కులను అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి బంధు పథకం అమలు చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయలను  చక్కగా సద్వినియోగం చేసుకుని ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని  మరింత పెంపొందించుకొని ఎదగాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బలహీన వర్గాలకు వందశాతం సబ్సిడీపై అందజేస్తున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పేర్కొన్నారు. బీసీ బంధు ఒక గొప్ప పథకం దేశంలో ఎక్కడా లేనదని తెలిపారు. నియోజకవర్గానికి 300 మందికి మొదటి దశలో ఎంపిక చేసి ఈరోజు ములుగు, వెంకటాపూర్ బీసీ కులస్తులకు 20 మందికి అందజేశామని, కొత్తగూడెం గంగారం మండలాలకు 31 మందికి,  మిగతా మండలాలకు మండల ప్రజాప్రతినిధులు అధికారులతో త్వరలో మండల కేంద్రంలోని అందిస్తామని మంత్రి తెలిపారు.

జిల్లాలో భారీ వాన‌లు, వరదలు 16 మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, జిల్లా వ్యాప్తంగా తీరని చేదు అనుభవాన్ని మిగిలించిందనీ  మంత్రి అన్నారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామస్తులు వరదల్లో చిక్కుకొని మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున  చెక్కుల పంపిణీ  చేశామన్నారు.కొండాయి, బూర్గుపేట, మల్యాల దొడ్ల,  గ్రామాల ప్రజలకు ఇండియన్ ఆయిల్ సంస్థ  బాధిత కుటుంబాలకు 10 లక్షల విలువగల 19 రకాల సరుకులతో కూడిన 1000 కిట్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్ కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలం, ఐ టి డి ఎ పి ఓ

అంకిత్ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య, ఆర్డీవో కే సత్యపాల్ రెడ్డి, జెడ్పిటిసిలు,  ఎంపీపీలు,  కో ఆప్షన్ మెంబర్లు , ఎంపీటీసీలు సర్పంచులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Sub Editor

హైదరాబాద్ సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో శౌర్య దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment