26.7 C
Hyderabad
May 3, 2024 07: 59 AM
Slider నిజామాబాద్

కరోనా ఎవేర్నెస్: సామాజిక దూరమే శ్రీరామ రక్ష

bichkunda 021

కరోన ప్రాణాంతక మహమ్మరికి సామాజిక దూరమే శ్రీరామ రక్ష అని అంబేద్కర్ సంఘం బాన్సువాడ డివిజన్ ప్రతినిధులు సాయిలు, గంగాధర్ అన్నారు.

మండల కేంద్రంలోని దళిత వాడలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ పట్ల అవగాహన కార్యక్రమం  నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో విజృంభించి ఇండియాలో విలయతాండవం చేస్తున్న కరోన వైరస్ గురించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు.

దీనికి మందులేదని సామాజిక దూరమే విరుగుడు అని వివరించారు. ప్రతి ముప్పయి నిమిషాలకు ఒకసారి చేతులు ఇరవై సెకండ్ల పాటు సబ్బు, శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. దగ్గు వస్తే చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మాస్కు ధరించి ఉండాలి. ఇంట్లో కనీసం మూడు ఫీట్లు సామాజిక దూరం పాటించాలి.

ఒంట్లో నలతగా ఉంటే డాక్టర్ ను సందర్శించి తగు సలహాలు తీసుకోవాలి. అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళారాదు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లూరి సాయిలు, ఉపాధ్యక్షులు చి౦తల గంగాధర్, పట్టణ అధ్యక్షులు  వినోద్, ప్రవీణ్, కాంతు, ఉద్యోగ సంఘం నాయకులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్

Satyam NEWS

ఎలిగేషన్: డిప్యూటీ సీఎం ఇంటిలోనే కరోనా కేసు

Satyam NEWS

వివాహ భోజనంబు’లో తొలి పాట ‘ఎబిసిడి…’ విడుదల

Satyam NEWS

Leave a Comment