30.7 C
Hyderabad
May 5, 2024 06: 48 AM
Slider మహబూబ్ నగర్

అన్ని వర్గాలకూ నష్టం ఒనగూర్చిన కరోనా మహమ్మారి

#RavulaChandrasekharaReddy

రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని   రావుల డిమాండ్ చేశారు. కరోన వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు  తీసుకోవాలని, కరోన సమయములో జర్నలిస్టుల పాత్ర అమోఘమని వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి టి.డి.పి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు అన్నారు.

ఇటీవల వనపర్తిలో ఆనారోగ్యంతో మరణించిన నందిమల్ల రామస్వామి కుటుంబసభ్యులను రావుల చంద్రశేఖర్ రెడ్డి కలసి ఓదార్చారు. పార్టీ అండాగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని అన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఆయన లేని లోటు మరవలేనిదని అన్నారు. అనంతరం రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారదా స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన సమయంలో అన్ని వర్గాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం కార్మిక, రైతు, నిరుద్యోగులను ఆదుకోవాలని అన్నారు. లాక్ డౌన్ సమయంలో దాదాపు 6000వేల కుటుంబాలను ప్రత్యక్షముగా సహాయం చేయడం జరిగిందని అన్నారు.

ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తానని అన్నారు. 90రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే రైతు వ్యతిరేఖ చట్టాలను ఉపసంహరించుకోవాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2021లో రాజకీయంగా కీలక పరిణామాలు జరుగుతాయని అన్నారు. కరోన సమయములో వైద్యుల,పోలీస్,జర్నలిస్టులు, మున్సిపల్,రెవెన్యూ,వారి సేవలు మారువలేనివి అని అన్నారు.

అదేవిధంగా రామస్వామి  సతీమణి  నందిమల్ల చెన్నమ్మకు 25000రూపాయల ఆర్ధిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో బి.రాములు,నందిమల్ల.అశోక్, వెంకటయ్య యాదవ్, నందిమల్ల శారదా, జెమీల్, రవియాదవ్, దస్తగిరి, ఎం.డి.గౌస్, ఫజల్, ఖాదర్, నారాయణ, గొల్ల శంకర్, అనిల్, వెంకట్, ముక్తార్, బాలయ్య, గోపాల్ ,చింతకాయల. జయరాం పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం మూసివేత

Satyam NEWS

మంత్రి రాబ్ డ్: సెల్ఫీ సెల్ఫీ నా కడియం ఏమైంది?

Satyam NEWS

స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరోనా వీరులకు ఉత్తమ సేవా పురస్కారాలు

Satyam NEWS

Leave a Comment