38.2 C
Hyderabad
May 3, 2024 22: 12 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో పెరిగిన కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

aallanani

రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  ఆళ్ల నాని చెప్పారు. నేడు వుడా చిల్డ్రన్స్ ఎరినా లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 220 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా 168 మంది కి నెగెటివ్ వచ్చింది, మిగిలిన వారి నివేదికలు కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు.

విశాఖ జిల్లా లో మూడు కేసులు నమోదు అయ్యాయని మంత్రి చెప్పారు. విశాఖలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చేసిన సేవలు అభినందనీయం అని ఎంత చేసిన ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అన్నారు. లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలు సహకారం ఇవ్వాలని స్పష్టం చేశారు.

వైద్య సిబ్బంది తమ కుటుంబాలను పక్కన పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి అభినందించారు. లాక్ డౌన్ విజయవంతం చేయాలని అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమన్నారు. విశాఖ లో కరోనా రెండో దశలో అడుగు పెట్టిందని  విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వచ్చిందని మూడో దశలోకి రాకుండా విశాఖ వాసులు ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఉచిత రేషన్ ఇస్తున్నామని వచ్చే నెల 4 వ తేదీన ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తున్నట్టు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలని,వారు గృహ నిర్బంధం లో ఉండాలని స్పష్టం చేశారు.

 సీతమ్మ ధార, అనకాపల్లి, గాజువాక,  హై రిస్క్ లో ఉన్నాయిని విదేశాల్లో నుంచి వారి సంఖ్య ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం అన్నారు. విశాఖ లో 20 కమిటీలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పనిచేస్తున్నాయిని చెప్పారు. విశాఖలో 1472 మంది విదేశాల నుంచి నగరానికి వచ్చారని వెల్లడించారు. 

వైద్య సిబ్బందికి మాస్కలు, పిపిఏ కిట్ లు అందుబాటులో ఉన్నాయిని చెప్పారు. ఔట్ సోర్స్ ఉద్యోగులకు జీతాలు చెలిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి గా పాటించాలని పేర్కొన్నారు.

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి  కన్నబాబు మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రకటించిన అనవసరంగా రోడ్ల పై తిరిగితే  ఆ వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఈ సాయంత్రం నుంచి మరింత కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. 

ఫార్మా పరిశ్రమలు తక్కువ సిబ్బంది తో పని చేయాలని మీడియా పై నియంత్రణ లేదని , పోలీస్ సిబ్బంది వారి విధులకు ఆటంకం కలిగించవద్దని కోరారు. జివిఎంసి మరింత గట్టిగా పనిచేయాలన్నారు. రైతు బజార్ లను స్కూల్ గ్రౌండ్స్, పెద్ద మైదానాలకు తరలిస్తున్నామని చెప్పారు.

Related posts

ప్రధాని మోడీపై నమ్మకంతో బిజెపిలో చేరుతున్న యువత

Satyam NEWS

దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన MLA

Satyam NEWS

ఫ్యామిలీ క్లాష్: మద్యం మరణాలు మొదలు

Satyam NEWS

Leave a Comment