39.2 C
Hyderabad
April 28, 2024 11: 22 AM
Slider నిజామాబాద్

బిచ్కుంద ప్రభుత్వాసుపత్రి తనిఖీ చేసిన వైద్యాధికారి

bichkunda hospital

బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బాన్సువాడ డివిజన్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ మోహన్ బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని రికార్డులు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రిలోని సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 113 మందికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనుమానంతో పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని తెలిపారు.

ఎల్లారెడ్డి, దోమకొండ బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల ఐసోలేషన వార్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరోనా బారిన పడిన వ్యక్తులకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేందుకు మద్నుర్ మండలం సలాబత్ పూర్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని నియమించామని అన్నారు.

విదేశాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తించి ముందస్తుగా  బాన్స్వాడ కామారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  ఆయన వెంట డి ఐ ఓ ప్రోగ్రాం అధికారి అనిల్ కుమార్ యూడిసీ నీలనాయక్, సాయిలు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Related posts

జాతీయ స్థాయిలో చొప్పదండి పీఏసీఎస్ కి మూడో సారి అవార్డు

Satyam NEWS

మల్టి జోన్ 1లో 16 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

Bhavani

బంగాళాఖాతంలో మరో సారి అల్పపీడనం

Satyam NEWS

Leave a Comment