34.7 C
Hyderabad
May 5, 2024 00: 50 AM
Slider ముఖ్యంశాలు

కరోనా ఎలర్ట్: చచ్చిపోతారని చెబుతున్నా వినకుండా…

Gandhi Hospital 402

కరోనా వైరస్ సోకిన వారు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా గాంధీ ఆసుపత్రిలోని కరోనా పేషంట్లు ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలోని మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. వీరందరిని గుర్తించిన ప్రభుత్వం గాంధీ ఆసుపత్రికి తరలించింది.

గాంధీ ఆసుపత్రిలో వారికి చికిత్స జరుపుతున్నారు. అయితే వారు వైద్యులకు ఏ మాత్రం సహకరించడం లేదు. వైద్యులు చెప్పిన ఏ విషయాన్నీ వారు సీరియస్ గా తీసుకోవడం లేదు. కరోనా వచ్చిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించాలి. పక్క నున్న వ్యక్తి కూడా కరోనా పేషెంటే అయినా దూరం పాటించాలి.

అలా దూరం పాటిస్తే ఎవరికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందో వారు బతికే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కరోనా వచ్చింది కదా అని అందరిని ఒకే చోట ఉంచితే అందరూ చచ్చిపోతారు. ఈ విషయాన్ని డాక్టర్లు చెబుతున్నా కూడా గాంధీ ఆసుపత్రిలో మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారు వినడం లేదు.

గుంపులు గుంపులుగా వారు నమాజు చేస్తున్నారు. వద్దన్నా వినకుండా ప్రవర్తిస్తున్న వీరిని ఏం చేయాలో అర్ధం కాక వైద్యులు తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

కచ్చితమైన నిబంధనలు చెబుతుంటే వైద్యులపైనే దాడులు చేస్తుండటం మరో ప్రధాన సమస్యగా మారింది.

Related posts

బ్లాక్ మేజిక్ అనుమానంతో వృద్ధురాలిని కొట్టి చంపిన గ్రామస్థులు

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీలోకి బిల్డర్ అమీర్

Satyam NEWS

విజయవాడలో ఆప్కో హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్ షో

Satyam NEWS

Leave a Comment