27.7 C
Hyderabad
May 11, 2024 10: 53 AM
Slider నల్గొండ

కోవిడ్ -19 వ్యాక్సిన్ పై మండల టాస్క్ ఫోర్స్ సమావేశం

#corona vaccine

జనవరి 16న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఏరియా హాస్పిటల్ నందు  నిర్వహించే  కోవిడ్ -19 వాక్సిన్  ప్రారంభ ఏర్పాటుపై  మండల టాస్క్ ఫోర్స్  సమావేశం MPP కార్యాలయంలో MPP గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో మండల వైద్యాధికారి Dr. లక్ష్మణ్  గౌడ్  మాటాడుతూ టీకా ప్రారంభోత్సవ  కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

హుజుర్ నగర్  మండలg లోని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని  విజయవంతం  చేయవలసిందిగా  కోరారు. మొట్ట మొదటిగా ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్య సిబ్బంది,అంగన్వాడీ సిబ్బందికి  ప్రాధాన్యతను ఇవ్వనున్నారని,

అందుకు సంబందించిన  వివరాలు  ఆన్ లైన్  చేశామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని, ఎవరు  ఎటువంటి అపోహలకు గురి కావొద్దని కోరారు. కోవిడ్ వాక్సిన్  రెండు డోసులు  తీసుకోవడం వల్ల  కరోనా నుండి రక్షణ  పొందుతారని తెలిపారు.

దశలవారీగా ఈ వ్యాక్సిన్ అందరికి  అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, తహశీల్దార్ వజ్రాల జయశ్రీ,హుజుర్ నగర్ మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు  గెల్లి  అర్చన రవి కుమార్, జక్కుల నాగేశ్వర్ రావు, హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొన్నారు.

Related posts

బాసరలో ఆఖరి శ్రావణ శుక్రవారం పూజలు

Satyam NEWS

వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి శాపం

Satyam NEWS

అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్

Satyam NEWS

Leave a Comment