38.2 C
Hyderabad
April 29, 2024 20: 35 PM
Slider ప్రత్యేకం

వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి శాపం

#raghurama

గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి పెను ఓటమికి నాంది కాబోతున్నాయన్నది స్పష్టమవుతోందని వైసీపీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె. రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. గత ఎన్నికల్లో మా పార్టీ గెలుపు  దోహదపడిన రెండు సంఘటనల్లో ఒకటి కోడి కత్తి డ్రామా. తన అభిమానితో భుజం మీద చిన్న గాయం చేయించుకొని జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ  ఫ్లైట్ ఎక్కారు. కానీ హైదరాబాదుకు చేరుకునే సరికి   స్ట్రెచర్ పై పడుకొని ఆసుపత్రిలోకి వెళ్లి చికిత్స పొందారు.

ఈ కేసును విచారించిన ఎన్ ఐ ఏ,  కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, జగన్మోహన్ రెడ్డి కోర్టు కు హాజరయ్యేందుకు నిరాకరించారు. ఈ సంఘటన వెనుక కుట్ర ఉందని, ఆ దిశగా విచారణ చేపట్టాలని కోరినప్పటికీ, ఎన్ఐఏ  నిరాకరించి ఆ పప్పులేమి ఉడకవని తేల్చి చెప్పింది. తనని ఎవరో హత్యచేయాలనుకున్నారని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని  చేశారు. కానీ ప్రభుత్వ పెద్దల ఎత్తు గడ చిత్తయింది. ఈ విషయాన్ని రానున్న ఎన్నికల్లోనూ వాడుకోవాలనుకున్న వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

నేడు ఆయన రచ్చబండ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహద పడిన మరొక సంఘటన  గొడ్డలి పోటు. వైఎస్ వివేకానంద రెడ్డిని మా పార్టీ నాయకులే వేయించారు. వైయస్ శివ శంకర్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు  మా పార్టీకి చెందిన నాయకులే. ఒకరేమో పార్టీ ప్రధాన కార్యదర్శి కాగా, మరొకరు పార్టీ ఎంపీ. మా పార్టీ నాయకులే హత్య చేయించి, నారా సుర రక్త చరిత్ర అని  సాక్షి దినపత్రిక ద్వారా తప్పుడు ప్రచారాన్ని చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు.

సిబిఐ తన  చార్జిషీట్ పగడ్బందీగా దాఖలు చేయడం తో ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. సంధింటివారు సంధింటివారు చంపుకున్నారని సిబిఐ చెప్పేసింది. వాళ్లు వాళ్లు చంపుకుంటే మీకెందుకన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి ఉన్నది. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా గత సంవత్సరన్నర  కాలం నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి కి ఎంతోమంది స్త్రీలతో సంబంధాన్ని అంట గట్టింది  సాక్షి దినపత్రిక, వైసీపీ నాయకులు కాదా?

వైయస్ వివేకానంద రెడ్డిని ఆస్తి కోసమే హత్య చేశారని, ఆయనకు రెండవ భార్య ఉన్నదని  ప్రచారం చేశారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారంతా భార్యలని అంటే, మన నాయకులకు ఎంతమంది నాయనమ్మలు, ఎంతమంది అమ్మమ్మలు, వారి పిల్లలకు ఎంతమంది పిన్నిలు  ఉండేవారు. సంబంధం ఉన్న ప్రతి స్త్రీ భార్య కాదని మహాసేన రాజేష్  చక్కగా వివరించారు. వైఎస్ వివేకానంద రెడ్డి పేరిట ఉన్న ఆస్తి స్వల్పం. ఆయన పేరుట ఉన్న ఆస్తి అంతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉన్నది. మరికొంత ఆస్తి ఆయన ఏకైక కుమార్తె అయిన సునీతా రెడ్డి పేరిట, ఈ హత్యకు ముందే  ఆయన రాశారు. ఆస్తి పత్రాలను పట్టుకు పోయారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.

ఆస్తి పత్రాలు ఎవరైనా  సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు పట్టుకు వచ్చి ఇచ్చారా? 8 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీట్ దర్యాప్తు చేసింది. ఈ విషయాన్ని అప్పుడు ఎవరైనా చెప్పారా? ఇంకా ప్రజల్ని అమాయకులుగా భావించి మభ్య పెట్టాలనుకోవడం ఆశ్చర్యకరం. అయినా ఈ విషయాలు మాట్లాడడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, ఏ హోదాలో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుగా  మాట్లాడుతున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మాట్లాడుతున్నారా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐ పై అభియోగాలను మోపడం ఆశ్చర్యకరంగా ఉంది. కర్నూల్లో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉండడానికి  ఆడిందంతా ఉత్తుత్తి డ్రామానేనని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టులో  సునీతా రెడ్డి పిటీషన్ దాఖలు చేస్తే, సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తనపై మోపిన 32 ఆర్థిక నేరాల కేసుల విచారణకు కోర్టుకు హాజరుకానని చెబితే, సిబిఐ నోరు మెదపకుండా ఉంది. దేశ చరిత్రలోనే ఒక వ్యక్తి కేసు విచారణకు కోర్టుకు హాజరుకానుని చెబితే తల ఊపిన ఘనత సిబిఐ కే దక్కుతుంది.

ఈ విషయంలో సిబిఐ కనీసం అప్పిలుకు కూడా వెళ్లలేదు. అంటే సిబిఐ ని  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశారా అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి పై ఆర్థిక నేరాల కేసులను డీల్ చేసింది అవినీతి నిరోధక విభాగం అధికారులు… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరుపుతున్నది నేర విభాగం అధికారులను స్పష్టమవుతుంది.

తొలుత వీరిని కూడా  మేనేజ్ చేయాలని చూశారు. కానీ తరువాత టఫ్ అని తెలిసి ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితిలో ఉన్నారు. సిబిఐ లోని ఒక విభాగం అధికారులు సహకరించిన తరువాత కూడా ఆ సంస్థ పై అభియోగాలను మోపడం అంటే, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థ ఉనికిని ప్రశ్నించడమే అవుతుంది. అది మొదటికే మోసాన్ని తెస్తుందని  గ్రహించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి కళ్ళల్లో భయం కనిపించింది. షర్మిల జోలికి వెళ్లలేదు.

కేవలం సునీత గురించే మాట్లాడారు. షర్మిల జోలికి వెళితే ఆమె గుబ గుయ్యమనిపిస్తుందని తెలుసు. ఢిల్లీ పెద్దలకు పాదపూజ చేశారు. ఎన్డీఏలో కలుస్తామని చెప్పారు. అయినా పని జరగలేదు. దీనితో సజ్జల కళ్ళల్లో ఏదో జరుగుతుందేమోనని భయం కనిపిస్తోంది. ఆయన మాటల్లోనే కథ అడ్డం తిరిగినట్లు స్పష్టమవుతుంది. సెప్టెంబర్ 11వ తేదీ వరకు  అవినాష్ రెడ్డి అరెస్టు ఉండకపోవచ్చు.

కానీ ఆ తరువాత ఏమైనా జరగవచ్చు. ఇంత అడ్డంగా దొరికిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు చూస్తుంటే, వీళ్లు  గొంతు వరకు నీళ్ల లో మునిగినట్లు స్పష్టమవుతోందని  రఘురామకృష్ణం రాజు తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఆత్మహత్య గావించబడడం, ఎలుక కోరిక ఒకరు చనిపోవడం, గాయానికి కుట్లు వేసిన కట్లు కట్టిన ఆసుపత్రి యజమాని కరోనా వల్ల తలలో రక్తస్రావం జరిగి మరణించడం వంటి సంఘటనలు అనుమానానికి తావు తీస్తున్నాయి. 

వీటన్నింటిపై సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే పరమేశ్వర్ రెడ్డి హాస్పిటల్ లో ఎందుకు దాక్కున్నారు. పరమేశ్వర్ రెడ్డిని విచారించిన అధికారులు ఆయనకు ఎటువంటి సమస్య లేదని చెప్పినా రుయా ఆసుపత్రిలో  మళ్లీ ఎందుకు చికిత్స పొందారని ప్రశ్నించారు. ఈ విషయాలపై సజ్జల రామకృష్ణారెడ్డి  సంసిద్ధత వ్యక్తం చేస్తే , మీడియా డిబేట్ కు నేను సిద్ధమేనని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.

Related posts

విజయనగరంలో విప్లవ జ్యోతి అల్లూరి విగ్రహావిష్కరణ

Satyam NEWS

అక్రమంగా ఇసుక తరలిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నట్లు?

Satyam NEWS

ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోట్ బుక్స్ పంపిణీ

Satyam NEWS

Leave a Comment