27.7 C
Hyderabad
May 4, 2024 07: 29 AM
Slider నల్గొండ

నేటి నుండి ప్రైవేట్ మెడికల్ షాప్ వర్కర్లకు బూస్టర్ టీకా

#suryapet

సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం 20వ,తేదీ నుండి మందుల షాపుల నిర్వాహకులు,వర్కర్లు తప్పనిసరిగా దగ్గర లోని వాక్సిన్ కేంద్రానికి వెళ్లి బూస్టర్ టీకా తీసుకోవాలని డిఎం & హెచ్ ఓ ఎండి.నిరంజన్, మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో వారు మాట్లాడుతూ రెండోవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారానే కరోనా నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుందని, వ్యాక్సిన్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు. భౌతిక దూరం పాటించటం,మాస్కులు ధరించడం,విధిగా సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కరోనా ను అరికట్టవచ్చు అన్నారు.15 – 17 సంవత్సరాల లోపు వారందరకి ఫ్రంట్లైన్ వర్కర్స్,హెల్త్ కేర్ వర్కర్లతో పాటు 60 సంవత్సరాల పైబడిన వారికి ప్రికాషనరి డోస్ అందించనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమములో ఆరోగ్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ,లలిత,ఆశా కార్యకర్తలు సుజాత,నిర్మల తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నా దేశం-నా జెండా

Satyam NEWS

ఎమ్మెల్యేను  కలిసిన టిఎన్జిఓ కొల్లాపూర్ యూనిట్ సభ్యులు

Satyam NEWS

అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Satyam NEWS

Leave a Comment