29.7 C
Hyderabad
May 4, 2024 03: 24 AM
Slider కవి ప్రపంచం

నా దేశం-నా జెండా

#MuluguLaxmiMaidhiliRD

నా దేశం పవిత్ర భారతదేశం

నా జెండా మువ్వన్నెల జెండా

ఎందరో దేశభక్తులున్న పుణ్యభూమి

భరత జాతి ఔన్నత్యాన్ని

నలుదిశలా చాటుతున్న జయపతాక

కాషాయం దేశపటిష్టత.. ధైర్యానికి గుర్తు

తెలుపురంగు శాంతి.. సత్యానికి సూచిక

ఆకుపచ్చ దేశప్రగతి,సస్యసమృద్దికి ప్రతీక

నడుమ అశోకచక్రం ధర్మానికి సంకేతం

 నా జాతీయ జెండా దేశానికి గర్వకారణం

మరెందరో వీరుల త్యాగ ఫలితమే

నేడు మన స్వాతంత్ర్య దినోత్సవం

నా త్రివర్ణ పతాకం

కులమత భాషాబేధాలకు అతీతమైనది

భారతీయుల దేశభక్తిని చాటిన జెండా

నా దేశం సైనికుల నరనరాల్లో

ప్రవహించే ఉడుకెత్తిన రుధిరం

నా జాతి పతాక సామాజిక చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది..

నా జెండా ధర్మానికి, న్యాయానికి నెలవు

విభిన్న సంస్కృతుల, ఆచారాలకు కొలువు

నాదేశమంటే మట్టి కాదోయ్..

నా దేశమంటే ప్రతి మనిషి ఒక జెండా

ఐకమత్యంతో గుండె గుండెను కలుపుదాం

వందేమాతరమంటూ

దేశానికి జీవితం పునరఅంకితం చేద్దాం

జయహో భారతదేశపు జెండా

శతృదేశాల పొగరణిచే విజయకేతనమై

భరతమాత కీర్తి శిఖరమై  నిలవాలి..!!

-ములుగు లక్ష్మీ మైథిలి, నెల్లూరు, ఫోన్:9440088482

Related posts

త్రిబుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

Satyam NEWS

అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ

Bhavani

కొవిడ్ మాస్క్ ల తయారీలో నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్

Satyam NEWS

Leave a Comment