37.7 C
Hyderabad
May 4, 2024 14: 51 PM
Slider జాతీయం

దేశంలో భారీగా పెరిగిపోతున్న కరోనా వైరస్ ఆర్ వ్యాల్యూ

#coronaVirus

ప్రతి రోజూ మూడు లక్షల మందికి కరోనా సోకుతున్నది. వేలాది మంది ప్రజలు శ్వాస తీసుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…. ఇదీ భారత దేశంలోని ప్రస్తుత పరిస్థితి.

ఈ స్థితి నుంచి దేశం బయటపడుతుందా? పడితే ఎప్పుడు బయటపడుతుంది? ఈ పరిస్థితి మరింత క్షీణ దశలోకి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అనుక్షణం నిశితంగా పరిశీలిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ అనూప్ థిక్కువెట్టిల్ తన పరిశోధనలోని అంశాలను వెల్లడిస్తున్నారు.

అనూప్ తిరువనంతపురంలోని చిత్రాతిరునల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని మాలిక్యులర్ మెడిసిన్ విభాగంలో ఆయన సీనియర్ సైంటిస్టుగా పని చేస్తున్నారు. కోవిడ్ 19 ఆర్ వ్యాల్యూ 1 కన్నా దాటకూడదని అయితే భారత్ లో ఇప్పుడు అది 1.5 ఉందని ఆయన చెప్పారు.

కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ 19 ఆర్ వ్యాల్యూ 3 పాయింట్ల వరకూ కూడా ఉందని, ఇది భయానక పరిస్థితికి దారితీస్తుందని ఆయన చెబుతున్నారు.

ఆర్ వ్యాల్యూ అంటే కరోనా వైరస్ పునరుత్పత్తి నిష్పత్తికి సంబంధించినది. అంటే మన దేశంలో కరోనా వైరస్ పునరుత్పత్తి విలువ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. ఆర్ వ్యాల్యూ 0.5 ఉంటే ఇద్దరు వ్యక్తుల నుంచి వైరస్ ఒక వ్యక్తికి సోకే అవకాశం ఉంటుంది.

ఆర్ వ్యాల్యూ 1 పాయింట్ ఉంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి మాత్రమే వైరస్ సోకినా కానీ ఇద్దరికి ఆ తర్వాత నలుగురికి ఆ తర్వాత 8 మందికి వైరస్ మల్టిప్లై అవుతూ వెళుతుంది.

అదే ఆర్ వ్యాల్యూ 2 ఉంటే అది డబుల్ అవుతుంది. సగటున దేశంలో ఆర్ వ్యాల్యూ 2 గా ఉండటం వల్ల పరిస్థితి భయానకంగా ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్ 19 వైరస్ ఆర్ వ్యాల్యూ 0.9గా ఉండేది.

అయితే వివిధ కారణాల వల్ల అది పెరుగుతూ వచ్చిందని డాక్టర్ అనూప్ చెబుతున్నారు. వైరస్ సోకిన వారి సంఖ్య దేశంలో రెట్టింపు అయితే ఆ తర్వాతి ఇన్ ఫెక్షన్లు అంతకు రెట్టింపు ఉంటాయి. ఈ లెక్కన దేశం తీవ్రమైన వైద్య సంక్షోభం దిశగా పయనిస్తున్నట్లు ఆయన అంచనా వేస్తున్నారు.

కరోనా వైరస్ ఆర్ వ్యాల్యూ తగ్గించేందుకు జర్మనీ, బ్రిటన్, దేశాలు తీవ్రంగా కృషి చేశాయని దాంతో అక్కడ కరోనా వైరస్ ఆర్ వ్యాల్యూ మైనస్ లోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు.

జర్మనీలో ఆర్ వ్యాల్యూ 0.9కు చేరుకున్నప్పుడు లాక్ డౌన్ ఎత్తేశారని ఆయన గుర్తు చేశారు. మన దేశంలో అలా జరగలేదు. ప్రస్తుతం బీహార్, అసోం రాష్ట్రాలలో ఆర్ వ్యాల్యూ 3 ఉంది.

Related posts

ఆంధ్ర అధికారులతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా బిజెపి ఆందోళన

Satyam NEWS

మీ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోండి చాలు

Satyam NEWS

Leave a Comment