42.2 C
Hyderabad
May 3, 2024 17: 05 PM
Slider కరీంనగర్

మీ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోండి చాలు

#ministergangula

దేశ సమాజంలో 65 శాతం ఉన్న బీసీ వర్గాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. యావత్‌ బీసీలకు సంబంధించి మూడు డిమాండ్లను చాలాకాలం ముందే కేంద్రం ఎదుట పెట్టినా వాటిపై కనీసం మాట కూడా మాట్లాడకపోవడం దీనికి నిలువెత్తు నిదర్శమన్నారు.

ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌తో కలిసి కరీంనగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా జరిగిన బీజేపీ జాతీయ కార్గ సమావేశాలు, సంకల్ప సభతోపాటు ప్రధాని మోదీ చేసిన ప్రసంగం, బీజేపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు జరుగుతున్న ఆన్యాయం, తెలంగాణ రైతులపై చూపుతున్న పక్షపాతం వంటి అంశాలపై మంత్రి మాట్లాడారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటుగా తెలంగాణలో జరిగాయి. ఈ సమావేశాలకు వచ్చిన ప్రధాని మోదీ ఒక బీసీ బిడ్డగా బీసీలకు సంబంధించి ఒక పాజిటివ్‌ డిక్లరేషన్‌ చేస్తారని బీసీ వర్గాలు భావించాయి. నిజానికి రాష్ర్టాల్లో ఉన్న మాదిరిగానే కేంద్రంలోనూ ప్రత్యేకంగా బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మోదీ సర్కారు ముందు డిమాండ్‌ పెట్టాం.

సమాజంలో 65 శాతం ఉన్న తమ బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే.. తప్పనిసరిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నది మా వర్గాల బలమైన డిమాండ్‌. కేంద్ర బడ్జెట్‌లో బీసీ వర్గాల అభ్యున్నతి కోసం నిధులు కేటాయించాలంటే సంక్షేమ శాఖ ఉన్నప్పడు మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఆ శాఖ లేకపోవడం వల్ల తూతూ మంత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కేంద్రంలోనే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని గతంలో చాలా సార్లు కోరాం.

అలాగే బీసీ కుల గణన చేయాలని చాలా కాలంగా కోరుతున్నాం. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ శానసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. బీసీ వర్గాల జనాభా తేలితే మా వర్గాలకు సముచిత న్యాయం కలుగుతుందని భావిస్తున్నాం. అంతేకాదు, బీసీ వర్గాల కుల గణన అనేది రాజ్యంగం మార్గాలకు కల్పించిన హక్కు. ప్రతి పది సంవత్సరాలకోసారి చేయాల్సి ఉంది. కానీ, ఈ విషయాన్ని కేంద్రం నీరుగార్చుతున్నది. బీసీ జనాభా తేల్చాలని మోదీ సర్కారు ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఇది ఒక తెలంగాణవాసుల డిమాండ్‌ కాదు, దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్‌. కానీ, ఈ విషయంలో బీజేపీ నిర్లక్ష్యం చూపుతున్నది.

దేశంలో బీసీల్లో 2,900 కులాలు ఉంటే.. 2,850కులాలు నేటికి చట్ట సభలకు దూరంగా ఉన్నాయి. జనాభాలో 65 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలతో ఈబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని మేము స్వాగతిస్తున్నాం. అయితే అత్యధిక జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంపై మా నిరసన వ్యక్తం చేస్తున్నాం.

అయితే రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేంద్రంలో బీసీ మంత్రితత్వ శాఖ ఏర్పాటు, బీసీ కుల గణన, చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు వర్తింపు అంశాలను చర్చించి ఒక డిక్లరేషన్‌ చేస్తారని బీసీ వర్గాలు ఆశించాయి. ఆ మేరకు మోదీ తెలంగాణ వేదికంగా బీసీలకు తీపికబురు చెబుతారని భావించాం.

కానీ, బీసీ వర్గాల ఆశలపై నీళ్లు చల్లారు. ఇంతటి ప్రాధాన్యతా అంశాలను ఏమాత్రం చర్చించలేదు. డిక్లరేషన్‌ చేయలేదు. కనీసం సంకల్పసభలో మోదీ ఒక్క మాటైనా చెప్పలేదు. ఈ పరిణామాలను చూస్తే బీసీలపై బీజేపీకి ఎంత కక్ష ఉన్నదో అర్థమవుతున్నది. ఇప్పటికే ఈ మూడు డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదా జరగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తుంది.

బియ్యం కొనుగోలుకు కేంద్రం చేసుకున్న ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకొని.. 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, వాటి విలువ రూ.22,400 కోట్లు. అయితే ప్రస్తుతం బియ్యం సేకరించడంలో కేంద్రం మొండి చేయి చూపుతున్నది. కేంద్రం డిమాండ్‌ ప్రకారం రా రైస్‌ ఇవ్వడానికి సైతం సిద్ధమని చెప్పాం. అయినా కొనకుండా తాత్సారం చేస్తున్నది.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సేకరించిన 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి బాధ్యత ఎవరూ వహిస్తారు? రూ.22,400 కోట్లు ఎవరూ ఇస్తారో చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. నిత్యం గొప్పలు చెప్పడం కాదు, రాష్ట్రంలో మీ ప్రధాని వచ్చే నాటికి 2,950 మిల్లులు మూత పడ్డాయి. వాటిపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఇదంతా మీ కేంద్రం మొండి వైఖరి పుణ్యమే కదా..! మరి ఈ విషయాన్ని మీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారో ప్రజలకు చెప్పాలి. అంతేకాదు వర్షకాలం పంట కొంటరా..? కొనరా..? ఏదో ఒకటి తేల్చిచెప్పాలి. 

మాటి మాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మాట్లాడుతున్నారు. దమ్ముంటే నేను సవాల్‌ విసురుతున్నా. ఒక ఎమ్మెల్యేను ముట్టుకొని చూడండి. పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చడం మీ వల్ల ఆయ్యే పని కాదు కానీ, మీ ముగ్గురు ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోండి చాలు.

ఇప్పటికే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తలోదిక్కు వెళ్లడానికి చూస్తున్నారు. మీ ఇంటిని చక్కదిద్దుకోండి. టీఆర్‌ఎస్‌ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టింది. తెలంగాణ ప్రజల ఆయుధం ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ గడ్డపై కేసీఆర్‌ ఉన్నంత వరకు బీజేపీ ఏమీచేయలేదు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టిచూసుకుంటారు.

బండి సంజయ్‌.. సభ ఏర్పాటు చేసి ప్రధానితో జబ్బలు చరిపించుకోవడం కాదు, ఒక పార్లమెంట్‌ సభ్యుడిగా నీ నియోజకవర్గానికి ప్రధాని ద్వారా ఒక్క హామీ అయినా ఎందుకు ఇప్పించలేకపోయావో ప్రజలకు చెప్పాలి. పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఉన్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.410 కోట్లు ఇచ్చింది. మీ కేంద్రం నుంచి రూ.410 కోట్లు తేవచ్చు కదా? ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడి ప్రజలు ఓటు వేస్తేనే కదా నీవు గెలిచింది. కానీ, రెండు రోజులు పాటు తెలంగాణలో ప్రధాని ఉంటే ఎందుకు ఒక్కహామీ ఇప్పించుకోలేకపోయావో చెప్పాలి అంటూ విమర్శలు గుప్పించారు.

Related posts

నో వైరస్ ఓకే:చైనా యువతి భారత యువకుడి పెళ్లి

Satyam NEWS

ఓట్ల రిగ్గింగు దొంగలు ఒక చోట దొరికి పోయారు

Satyam NEWS

ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

Satyam NEWS

Leave a Comment