27.7 C
Hyderabad
May 4, 2024 08: 32 AM
Slider ప్రత్యేకం

గుజరాత్ ఎన్నికల్లో రాని కరోనా.. ఎపిలో ఎలా వస్తుందో?

#SudhakarNB24

ఫిబ్రవరిలో 21, 28 తేదీల్లో గుజరాత్ స్థానిక ఎన్నికలు షెడ్యూలు విడుదలైన విషయం ఎపి ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తించాలని టిటిడి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.

అక్కడ ఎన్నికలు జరిపితే రాని కరోనా ఇక్కడ ఎలా వస్తుందో, ఉద్యోగుల ప్రాణాలు ఎలా పోతాయో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలు షెడ్యూలు ప్రకటించింది.

ఆరు మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21 ఎన్నికలు జరుగుతాయని, 23 లెక్కింపు నిర్వహిస్తామని ప్రకటించారు. 

81 మునిసిపాలిటీలకు, 31 జిల్లా పరిషత్ లకు, 231 తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయని, మార్చి2న లెక్కింపు జరుగుతుందని కమిషన్ తెలిపినట్లు సుధాకర్ రెడ్డి అన్నారు.

ఎన్నికలు జరిపితే కరోనా ఎక్కువ అవుతుందన్న వితండవాదానికి తావులేకుండా ఎన్నికలు  జరపవచ్చని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని ఆయన అన్నారు.

దీనిని బట్టి చూస్తే జగన్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలు అసంబద్ద వాదనలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోందని ఆయన తెలిపారు.

Related posts

డివైన్ పవర్: రేపటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు

Satyam NEWS

ఇన్ ఫ్లూయన్షియల్: అత్యాచారం చేసి ఆసుపత్రిలో రెస్టు

Satyam NEWS

రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం

Bhavani

Leave a Comment