పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో అప్పులు తీర్చలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జడ్చర్ల మండల ప్రాంతంలో జరిగింది.
జడ్చర్ల మండలం, కోల్ బాయి తండా, చికురు గాని పల్లి గ్రామ పంచాయతీ కి చెందిన కేతావత్ చందర్ నాయక్ (55) గంగాపురం గ్రామ శివారులో రాములు కు చెందిన 18 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని 9 ఎకరాలలో పత్తి మిగతా పొలంలో మొక్కజొన్నను వేశాడు.
జడ్చర్ల శ్రీనివాస ఎరువుల దుకాణంలో విత్తనాలు, ఎరువులను అప్పుగా తీసుకున్నాడు. మొత్తం పెట్టుబడి ఒక లక్ష యాబై వేల వరకు అయింది. బయట మూడు లక్షల వరకు అప్పులు ఉన్నాయి. పత్తి పంట ముప్పై ఐదు క్వింటాలు వరకు పండింది. అధిక వర్షాల వలన పత్తి నల్లగా మారి పాడైంది.
దానికి మార్కెట్ లో మంచి ధర రాకపోవటం తో అప్పులు తీర్చలేని మనస్తాపంతో నిన్న రాత్రి 12 గంటలకు కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని చనిపోయాడు. ఇతనికి ముగ్గురు ఆడ పిల్లలు ఇద్దరు కొడుకులు. నలుగురు పిల్లలకు వివాహాలు అయ్యాయి.