వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత అవమానకర పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ పదవి నుంచి బయటకు పంపేసిన సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యం కు మహర్దశ పట్టింది. ఆయన ను అత్యంత కీలకమైన, ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ఇష్టమైన నీతి ఆయోగ్ కు కార్యదర్ధిగా నియమించనున్నారు.
ప్రస్తుతం నీతీ ఆయోగ్ కార్యదర్శిగా ఉన్న మాధుర్ త్వరలో పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో అత్యంత సమర్ధుడైన సీనియర్ ఐఏఎస్ అధికారిని అక్కడ నియమించాలని యోచించారు. ఈ దశలో ఎల్ వి సుబ్రహ్మణ్యం కు ఆ ఆఫర్ ఇచ్చారు. ఢిల్లీ నుంచి సత్యం న్యూస్ కు తెలిసిన వివరాల ప్రకారం బహుశ ఈ నెలాఖరు లోపు ఎల్ వి సుబ్రహ్మణ్యంకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది.
నీతి ఆయోగ్ లో ఇది అత్యంత కీలకమైన పదవి. ఎల్ వి సుబ్రహ్మణ్యం తన మాట వినడం లేదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనను అత్యంత అవమానకర రీతిలో బయటకు పంపిన విషయం తెలిసిందే.