40.2 C
Hyderabad
April 28, 2024 16: 36 PM
Slider ముఖ్యంశాలు

మార్చి 26 నుండి విజయవాడ టూ షిర్డీ విమానం

#saibaba

ఇప్పటి వరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్ళాలంటే ట్రైన్ లోనే లేక హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ లో షిర్డీ చేరుకునే వాళ్ళు. ట్రైన్ లో జర్నీ అంటే 12 గంటలు పైనే సమయం పట్టే పరిస్థితి, అదికూడా నాగర్సోల్ స్టేషన్ లేక సాయి నగర్ స్టేషన్ లో దిగి అక్కడనుండి రోడ్ మార్గాన షిర్డీ చేరుకునే వాళ్ళు. కానీ ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ షిర్డీకి వెళ్లే సాయి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 26 నుంచి ప్రతీ రోజు విజయవాడ నుంచి నేరుగా షిర్డీకి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటీఆర్ 72-600 విమానంను షిర్డీకి ఖరారు చేసారు. అందులో 72 మంది ప్రయాణీకుల వెళ్లే సామర్థ్యం ఉంది. ప్రతీ రోజు మధ్నాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయల్దేరే ఈ విమానం 3.00 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. అదే విధంగా ప్రతీ రోజు షిర్డిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. అంటే షిర్డీ కేవలం 2 గంటల 50 నిమిషాల్లో చేరవచ్చు అన్నమాట. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి షిర్డీ కి ప్రారంభ టికెట్ ధర 4,246/- అలాగే షిర్డీ నుండి రిటర్న్ టికెట్ ధర 4,639/- గా నిర్ణయించారు.

Related posts

30 వ రోజు నరసరావుపేటలో కొనసాగుతున్నటీడీపీ దీక్షలు

Satyam NEWS

విద్యార్థినులకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్

Murali Krishna

కొల్లాపూర్ డివిజన్ టిఎన్జీవో సంఘం ఎన్నికలు పూర్తి

Satyam NEWS

Leave a Comment