గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు. కాజ గ్రామంలోని పుల్లయ్య నగర్ లో నివాసం ఉండే పోలిశెట్టి పూర్ణచందర్రావు, పోలిశెట్టి లక్ష్మి అనే దంపతులు సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల భాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మంగళగిరి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
previous post