34.7 C
Hyderabad
May 5, 2024 01: 50 AM
Slider మహబూబ్ నగర్

అంతరాలు లేని సమాజం కోసం అందరూ పోరాడాలి

#CPIKollapur

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 96వ వార్షికోత్సవాల ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం లోని నార్లపూర్ గ్రామంలో సిపిఐ జండా ఆవిష్కరణ జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ ఎం డి ఫయాజ్ మాట్లాడుతూ ప్రస్తుత దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ నగరంలో కామ్రేడ్ ఘాటియా నాయకత్వంలో సిపిఐ ఏర్పడదని నాడు జరిగిన దేశ స్వాతంత్ర ఉద్యమంలో లో అనేక కుట్ర కేసు ఎదుర్కొని అలుపెరగని పోరాటం నిర్వహించిందని అన్నారు. తదనంతరం జరిగిన అనేక పీడిత తాడిత ప్రజల సమస్యల విముక్తి పోరాటం లో అగ్రభాగాన నిలిచిందని అన్నారు. దున్నేవాడిదే భూమి అనే చారిత్రక నినాదం ఇచ్చి ఒక్క తెలంగాణలోని పది లక్షల ఎకరాల భూమిని భూమి లేని ప్రజలకు పంచింది అన్నారు.

18 సంవత్సరాల యువతీ యువకులకు ఓటు హక్కు కావాలని, బ్యాంకుల జాతీయకరణ చేయాలని ఇలా అనేక జాతిని నిర్మించే ఉద్యమాలను ముందుండి పోరాటాన్ని నడిపిన అన్నారు. నేడు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న న్యాయబద్ధమైన సమరశీల పోరాటాలకు బాసటగా నిలవాలని రైతులను ఫయాజ్ కోరారు.

ఈ సందర్భంగా వారు కేంద్రంలోని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో వేదికలపై ఉపన్యాసాలిచ్చారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతు పోరాటాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగు పడినట్లు చరిత్రలో ఎక్కడా లేదని గుర్తుంచుకోవాలని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు.

నార్లపూర్ ముక్కిడి గుండం కుడికిళ్ల మల్ల చింతలపల్లి సోమశిల రామాపురం తదితర అ గ్రామాల్లో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో అనేక పార్టీలు రావడం చూశామని అధికారం లేకుంటే పట్టుమని పది సంవత్సరాలు కూడా కొనసాగించలేని ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఐ మాత్రమే 96 సంవత్సరాల్లో ఒక్కరోజు అధికారంలో లేకున్నా పీడిత తాడిత ప్రజల సమస్యలు పెద్ద ఎత్తున ఉద్యమం మొక్కవోని దీక్షతో పనిచేస్తుందని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సమితి సభ్యులు జి కురుమయ్య అధ్యక్షత వహించగా సిపిఐ మండల నాయకులు ఎండీ యూసుఫ్ మద్దిలేటి రాముడు డు నరసింహ వెంకటమ్మ అలివేలమ్మ శివుడు రాముడు తదితరులు పాల్గొన్నారు

Related posts

శేరిలింగంపల్లిలో శ్రీ అభయ వీరంజనేయ స్వామి ఆలయానికి శంఖుస్థాపన

Satyam NEWS

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళకు రక్తదానం

Satyam NEWS

ములుగు పంచాయితీకి వికాస్ పురస్కారం

Satyam NEWS

Leave a Comment