మహాత్మాగాంధీ ని చంపిన నాధురామ్ గాడ్సే ని దేశ ద్రోహిగా కేంద్రం ప్రకటించాలని వామపక్షాలు నేడు ర్యాలీ నిర్వహించాయి. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఈ భారీ ర్యాలీ జరిగింది. ఆర్.అండ్. బి.బంగాళా నుంచి ఈ ర్యాలీ గాంధీ విగ్రహం వరకు నిర్వహించారు. అనంతరం గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహం కు పూల మాల వేసి నివాళులర్పించి, గాడ్సే దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. గాడ్సే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి పి.మహేష్, సీపీఎం ఏరియా కార్యదర్శి రవి, ఏ.ఐ. టు.సి జిల్లా కార్యదర్శి యం.యస్ . రాయుడు, సి.ఐ. టి.యు. శంకరమ్మలు తదితరులు పాల్గొన్నారు.