Slider కడప

టెంపుల్ బెల్: ఘనంగా నేడు పాలేటి ప్రమాణ స్వీకారోత్సవం

meda malli 30

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శ్రీ  ఆంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ గా నేడు పాలేటి రాధాకృష్ణ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ మర్యాదల ప్రకారం ముందుగా ఆయనకు పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాజంపేట  శాసన సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే విధంగా  పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ప్రధాన అతిధిగా హాజరయ్యారు.

పట్టణ కన్వీనర్ పోలా శ్రీనువాసులు రెడ్డి, చొప్ప యల్లారెడ్డి  స్థానిక నాయకులు ఖలీల్, ఉమ మహేశ్వర రెడ్డి, అకేపాటి సుబ్రమణ్యం రెడ్డి, వజ్ర రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పాలేటి రాధాకృష్ణ రెడ్డికి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన శాయశక్తులా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

వడగాలులతో అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

ఉగ్రవాదుల యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం

Satyam NEWS

మణిపూర్ పరిస్థితులపై అమిత్ షా సమీక్ష

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!