27.7 C
Hyderabad
May 14, 2024 04: 03 AM
Slider రంగారెడ్డి

పట్టాలు ఉన్నవి మాత్రం కూల్చివేస్తారా?

#cpi

ప్రజావాణిలో అధికారులను ప్రశ్నించిన సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్

స్వయంగా మునిసిపల్ అడ్మినిస్ట్రేట్ ప్రధాన కార్యదర్శి  గాజులరామరం లో అక్రమంగా వెలిసిన  2500 ఇండ్లను కూల్చివేయ్యమంటే కూల్చివేయ్యని అధికారులు, నేడు జీఓ 59 లో దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్నప్పటికీ, వారు గత 15 సంవత్సరాలుగా టాక్స్ చెల్లిస్తున్నపటికి డబ్బులు కట్టలేదని అధికారులు కూల్చేవేస్తామని బెదిరించడం కూల్చివేయడం ఏ చట్టప్రకారం ఉందని నేడు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, బాచుపల్లి మండల కార్యదర్శి శ్రీనివాస్ అధికారులను నిలదీశారు. వెంటనే కూల్చివేయ్యాడలను ఆపేసి ప్రజలకు న్యాయం చెయ్యాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే సర్వే నంబర్లో ఉన్న ఇండ్లకు ఒకే విధంగా రుసుం విధించాలి కానీ ఒక్కొక్కరికి వేరువేరుగా 10 లక్షల వ్యత్యాసం ఉండటం చూస్తుంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో తెలుస్తుందని విమర్శించారు. రేకులు ఉన్న గృహాలకు 19 లక్షలు వేసి,2 అంతస్తుల బిల్డింగ్ ఉన్నవాటికి 3 లక్షలు వెయ్యడం అధికారులు నిద్రపోయి పనిచేసారా అని ప్రశ్నించారు.  గతంలో కాంగ్రెస్,ఇప్పట్టి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నవాటిని కూల్చివేస్తామని,కూల్చివేయడం తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. ఇదే అధికారులు తమ కండ్లముందు వందల ఎకరాలు కబ్జా అవుతుంటే మాత్రం పట్టిచుకోకుండా ఉండటం, సాక్షాత్తు మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి గారు గాజులరామరం సర్వే నెంబర్ 326,329,342,308 లలో వెలిసిన అక్రమ నిర్మాణాలు ఎందుకు కూల్చివేస్తాలేరని ముందు ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయ్యాలని డిమాండ్ చేశారు.

స్థానిక ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో అందరికి పట్టాలు ఇప్పిస్తామని,రెండు పడకల గదులు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు వారు కష్టాల్లో ఉంటే మాత్రం పట్టించుకోవట్లేదని ప్రజాప్రతినిధులు తమ పదవులు కాపాడుకోవడం కోసం,డబ్బులు సంపాదించుకోవడంలో మునిగిపోయారని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి శ్రీనివాస్,మండల కార్యవర్గ సభ్యులు వి.శ్రీనివాస్, ప్రభాకర్,ఇమామ్,గట్టయ్య,జగన్,చంద్రమోహన్,ప్రకాష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

జలసంరక్షణలో ఏపికి అవార్డుల పంట

Satyam NEWS

సీమ్లా ఒప్పందానికి విపక్షాలు సిద్ధం

Satyam NEWS

ఏపి ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం

Satyam NEWS

Leave a Comment