40.2 C
Hyderabad
May 1, 2024 17: 47 PM
Slider జాతీయం

సీమ్లా ఒప్పందానికి విపక్షాలు సిద్ధం

#rahulgandhi

పాట్నాలో జరిగిన 15 విపక్ష పార్టీల సమావేశం ఇప్పుడు సీమ్లా ఒప్పందానికి సిద్ధం అవుతోంది. దాదాపు 400 స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు చెందిన వారు ఒక్కరే పోటీ చేస్తారు. ఈ మేరకు సీమ్లా ఒప్పందం ఉంటుంది. జూలై 12వ తేదీన జరిగే సిమ్లా సమావేశంలో దీనిపై అన్ని పార్టీలూ ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటించవచ్చు. గత లోక్‌సభ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, తాజాగా విపక్షాలు అనుసరించబోయే వ్యూహం చాలా ప్రభావవంతంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.

గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యంతో 46 సీట్లు గెలుచుకుంది. మరోవైపు 23 స్థానాల్లో విపక్ష పార్టీ అభ్యర్ధులు నాలుగు లక్షలకు పైగా ఓట్లు సాధించారు. నాలుగు లక్షలకు పైగా ఓట్లు సాధించిన వారిలో కాంగ్రెస్ తో బాటు ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల అభ్యర్ధులు ఉన్నారు. విపక్షాలు అన్నీ కలిసినా కూడా మొత్తం 69 సీట్లలో పెద్దగా మార్పు ఉండదు. మూడు లక్షలకు పైగా ఆధిక్యంతో బీజేపీ 105 సీట్లు గెలుచుకుంది. ఇందులో సగభాగంలో కాంగ్రెస్‌ అభ్యర్ధులతోనే తలపడింది.

బీజేపీకి 2014లో 31 శాతం, 2019లో 37 శాతం ఓట్లు వచ్చాయి, 2024లో 39 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. అయితే విపక్షాలు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నందున ఇది బీజేపీకి సాధ్యం అవుతుందా అనేది ప్రశ్నార్ధకం. బీజేపీ రెండు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన సీట్లపై విపక్షాల చూపు నిలిపాయి. 2019లో 164 సీట్లలో బీజేపీ రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది. గత సారి లక్ష కంటే తక్కువ తేడాతో బీజేపీ 77 స్థానాలు గెలిచింది. విపక్షాలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తే ఇక్కడ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలవచ్చు.

ఈ 77 సీట్లలో 60 సీట్లను విపక్షాలు చేజిక్కించుకుంటే, బీజేపీ 302 నుంచి 242కి పడిపోతుంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటం ఎంత ముఖ్యమో కూడా ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. యూపీలో గత సారి లక్ష కంటే తక్కువ తేడాతో బీజేపీ 20 సీట్లు గెలుచుకుంది. అంటే అఖిలేష్, కాంగ్రెస్ కలిస్తే యూపీలో బీజేపీకి 20 లోపు సీట్లు వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బలమైన విపక్ష కూటమి ఏర్పడుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం 142 సీట్లు (పుదుచ్చేరితో కలిపి) ఉన్నాయి.

ఇక్కడ ప్రతిపక్షాలు 80 శాతం సీట్లు కైవసం చేసుకుంటే అధికారం హస్తగతమౌతుంది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పొత్తు అవసరం లేదు. కొంతవరకు, గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 130 సీట్లు ఉండగా గతసారి బీజేపీ 122 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలలో మొత్తం సీట్లు 142 ఉన్నాయి. సమస్య మొత్తం ఇక్కడే కనిపిస్తున్నది. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌ కాంగ్రెస్ తో పూర్తిగా కలిసి వస్తే తప్ప ఇక్కడి పరిస్థితి మారదు. నిజానికి ఇక్కడ అన్ని పార్టీలూ త్యాగాలు చేసి చూపించాలి.

Related posts

ఐ ఎన్ టి యు సి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా యరగాని నాగన్న

Satyam NEWS

కృష్ణా నది తీర గ్రామ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

Satyam NEWS

మ్యాడ్ నెస్: మానవత్వం మరచి మంటల్లో కాల్చి

Satyam NEWS

Leave a Comment