జల సంరక్షణ , సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు, నీటి వినియోగంలో జాతీయ జల మిషన్ ఇచ్చే అవార్డులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పురస్కారాలు దక్కాయి. వాతావరణ మార్పులతో కలిగే ముప్పును అంచనా వేయడం అన్ని బేసిన్లలో సమగ్ర నీటి యాజమాన్య నిర్వహణలో జల వనరుల విభాగం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. జలవనరుల సమాచారం, నిర్వహణ వ్యవస్థ విభాగంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచారం, నిర్వహణ విభాగానికి… కర్నూలు జిల్లాలో సూక్ష్మ నీటి నిర్వహణలో పనితీరుకు రాష్ట్ర ఉద్యానశాఖకు.. నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులకు గుంటూరులోని హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి. దిల్లీలో ఈ నెల 25వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మెుత్తం 23 అవార్డులు ప్రదానం చేయనున్నారు.
previous post
next post