రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించిన కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం ఎదుట రాష్ట్రంలో కాంగ్రెస్,సిపిఐ కూటమి ఘన విజయం పట్ల కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించినందున ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
రాష్ట్రంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇండ్లు, ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచాలని, వరంగల్ మహానగరంలో అండర్ డ్రైనేజీ రోడ్లు, విద్యా వైద్యం సౌకర్యాలు మెరుగుపరుచుటకు నూతన ఎన్నిక శాసనసభ్యులు ప్రభుత్వం కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు డాక్టర్ పల్లేరు వీరాస్వామి, నేదునూరి రాజమౌళి,మునిగాల బిక్షపతి, మాలోతు శంకర్, గుంటి రాజేందర్,అంబి సాంబయ్య, రీల్ పూర్ణచమదర్, ఎండి. ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.