37.2 C
Hyderabad
May 6, 2024 11: 28 AM
Slider ఆదిలాబాద్

నేరస్తులను పట్టుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడండి

nirmal sp 12

నేరస్తులను పట్టుకోవడానికి పాత పద్దతులను విడనాడి పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. ముఖ్యంగా నేర స్థలం నుండి వెంటనే వేలి ముద్రలను సేకరించాలని, టవర్ డంప్ ల సహాయముతో డేటాను సేకరించి విశ్లేషించాలని ఆయన అన్నారు.

జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల క్రైమ్ స్టాఫ్, జనరల్ వర్టికల్ అధికారులకు నేడు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర స్థలం నుంచి మరియు సి.సి. పుటేజిలను సేకరించి జిల్లా పొలీసు కార్యాలయములోని సైబర్ ల్యాబ్ లో వీడియో ఎన్హేన్స్ చేయడం ద్వారా నేరస్తులను త్వారగా పట్టుకోవడమే కాకుండా నేరం రుజువు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి.సి.యస్. ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఐ.టి. కోర్ టీమ్ ఇంచార్జి యస్.కే. మురాద్ అలీ, అన్ని పోలీస్ స్టేషన్ ల క్రైమ్ స్టాఫ్, జనరల్ వర్టికల్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌

Satyam NEWS

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: నిర్భయ కేసులో ఇక ఉరికి దారి

Satyam NEWS

Leave a Comment