నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు వాదనలు విన్నది.
జడ్జిమెంటును రిజర్వులో పెట్టింది. నేటి ఉదయం ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించింది. ముకేష్ వాదనలో పస లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాంతో కేసు కొట్టేశారు. ఒక ఉరి శిక్ష యధాతధంగా అమలు జరుగుతుంది.