38.7 C
Hyderabad
May 7, 2024 15: 20 PM
Slider మహబూబ్ నగర్

పంట నమోదు కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం

#cropregister

డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ తో బాటు ఇతర సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నది.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్, పెద్ద కొత్తపల్లి, కోడెర్, పెంట్లవెల్లి మండల రైతులు తక్షణమే పంట నమోదు కార్యక్రమం లో పాలుపంచుకోవాలని కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన అధికారి లక్ష్మణ్ ఒక ప్రకటనలో కోరారు.

రైతుల భూమిలో ఏ పంట ఉందో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారితో (AEO)నమోదు చేసుకోవాలి. పండ్ల తోటలు మామిడి, జామా, దానిమ్మ, బత్తాయి,  నేరేడు, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలo, శ్రీ గంధం, బొప్పాయి, అరటి, ఎర్రచందనం రైతులు నమోదు చేసుకోవాలి.

అదే విధంగా కూరగాయ పంటలు టొమాటో, వంగ, బెండకాయ, మిర్చి, తీగ జాతి కూరగాయలు పండించే రైతులు కూడా నమోదు చేసుకోవాలి.

ఇలా నమోదు చేసుకున్న రైతులు డ్రిప్, ఇతర సబ్సిడీ పథకాలకు అంతరాయం కలగకుండా చూసుకోవచ్చునని కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన అధికారి లక్ష్మణ్ తెలిపారు.  

Related posts

రీచా చద్దా పై వివాదాస్పద వార్తలు ప్రసారం చేయవద్దు

Satyam NEWS

పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్‌ ఇల్లు

Satyam NEWS

మనాలిలో షూటింగ్ జరుపుకుంటున్న అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’

Satyam NEWS

Leave a Comment