37.2 C
Hyderabad
April 26, 2024 20: 37 PM
Slider విజయనగరం

క‌రోనా పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలి

#suryakumariias

క‌రోనా  పరిస్థితుల నేపథ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి తీసుకుంటున్న చ‌ర్య‌లు అన్ని శాఖ‌ల ఉద్యోగ‌స్తుల‌లో గుబులు, ఆందోళ‌న పుట్టిస్తున్నాయి. తాజాగా ఈ నెల 10  జ‌ర‌గ‌నున్న వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఇచ్చిన ఆదేశాలు దిమ్మ దిరిగేలా ఉన్నాయి. క‌రోనా దృష్ట్యా ఇళ్ల‌ల్లోనే ప్ర‌తీ ఒక్క‌రూ వినాయ‌క చ‌వితి పండ‌గ జ‌రుపుకోవాల‌ని బ‌హిరంగంగా మండాలు, ఊరేగంపులు నిషిద్ద‌మ‌ని కలెక్ట‌ర్ తెలిపారు.

రానున్న వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.

ప్రజలంతా ఈ మార్గదర్శకాలు పాటిస్తూ క‌రోనా నిబంధనల మేరకు ఉత్సవాలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రతిమల ఏర్పాటు, పెండాళ్ళ ఏర్పాటు చేయడాన్ని నిషేధించామని పేర్కొన్నారు. ప్రజలు పండుగ సరుకులు, వస్తువుల కొనుగోలు కోసం మార్కెట్ లకు వెళ్ళేటపుడు మాస్క్ లు ధరించడం,త‌ప్ప‌ని స‌రి అని అన్నారు.

ఇతరుల నుండి కనీసం ఆరు అడుగుల దూరం పాటించడం వంటి క‌రోనా నిబంధనలు పాటిస్తూ ఈ వ్యాధి నియంత్రణలో సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలోని రెవెన్యూ, పోలీస్ అధికారులు ఈ మార్గదర్శకాలు అమలు చేస్తూ, ప్రజల్లో క‌రోనా నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత ను గురించి వివరించాలని పేర్కొన్నారు.

Related posts

ఫర్ సొసైటీ: బిహార్‌లోభారీ మానవహారం

Satyam NEWS

రోజుకో మాట: కొత్త పార్టీ పెట్టడం లేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటన

Satyam NEWS

టేక్ ఆక్షన్:రాధిక హంతకుని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment