37.2 C
Hyderabad
May 6, 2024 13: 27 PM
Slider పశ్చిమగోదావరి

నేల స్వభావాన్ని బట్టి పంట దిగుబడి

#Crop yield

నేలల స్వభావాన్ని బట్టి కూడా పంటల దిగుబడులు ఉంటాయని ఏలూరు జిల్లా పెదవేగి మండల వ్యవసాయాధికారి ఎం.ప్రియాంక అన్నారు. మండలం లోని న్యాయం పల్లి గ్రామం లో ఏ ఓ బుధవారం మొక్కజొన్న పంట పొలాల్లో పొలం బడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భం గా ఏ ఓ ప్రియాంక మొక్కజొన్న రైతులతో మాట్లాడుతూ మొక్కజొన్న పంట అనువైన నేలలలో బలంగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయని చెప్పారు.

కొన్ని రకాల చౌడు భూముల్లో మొక్కజొన్న పంట కు ఎదుగుదల లోపం తో పాటు జింక్, పొటాషియం, నత్రజని శాతం తగ్గి మొక్క దశలోనే తెగుళ్లు బారిన పడుతుందన్నారు. ఇటువంటి నే ల ల లో మొక్కజొన్న సాగు చేసే రైతులు నే ల స్వభావాల ను భూ పరీక్షల ద్వారా తెలుసుకుని సాగు చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న పంట పొత్తు ఏర్పడే

దశలో మిత్ర పురుగులు, శత్రు పురుగులు ఆశిస్తాయని చెప్పారు. పురుగుల సంఖ్యను అంచనా వేసుకుని పురుగు నివారణకు అవసరమై తే పురుగుమందును పిచికారీ చేయాలని ఏ ఓ ప్రియాంక న్యాయం పల్లి రైతులకు సూచించారు. మొక్కజొన్న కర్రల ఆకుల మాటున, మొవ్వుల లో దాగి ఉన్న పురుగుల ను గుర్తించి రైతులతో తీయించారు.

మొక్కజొన్న పంటలో పురుగు మందు పిచికారీ చేసే సమయం లో రైతులు మొఖానికి మాస్క్ లు, చేతులకు గ్లౌజ్ లు తప్పనిసరిగా దరించాలన్నారు. ఈ కార్య క్రమం లో రైతులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ కు ఉరుములతో కూడిన వర్ష సూచన

Satyam NEWS

పాత్రుని వలసలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

Satyam NEWS

ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని సమర్థించిన లక్ష్మీపార్వతి

Satyam NEWS

Leave a Comment