38.2 C
Hyderabad
April 29, 2024 21: 04 PM
Slider ముఖ్యంశాలు

ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని సమర్థించిన లక్ష్మీపార్వతి

#laxmiparvati

అందరూ అనుకున్నట్లు గానే లక్ష్మీపార్వతి జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని లక్ష్మీపార్వతి పూర్తిగా సమర్థించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షురాలుగా ఉన్న లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తనకు సమ్మతమేనని ఆమె వెల్లడించారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు ఉన్నందున అంతకన్నా చిన్నదైన హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం తనకు సమ్మతమేనని ఆమె అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ తనకు జిల్లా పేరు కావాలా? లేక యూనివర్సిటీకి ఎన్టీఆర్ కు పేరు కావాలా అని అడిగితే తాను జిల్లాకు ఎన్టీఆర్ పేరే ఉండాలని చెబుతానని లక్ష్మీపార్వతి అన్నారు. అదే సమయంలో ‘‘కర్ర విరగకుండా పాము చావకుండా’’ అభిప్రాయం చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి పూర్తిగా సమర్థించారు. ఎన్టీఆర్ ను అవమానించిన చంద్రబాబునాయుడు అసలు ఎన్టీఆర్ పేరు తలచేందుకే అనర్హుడని ఆమె అన్నారు. చంద్రబాబునాయుడితో బాటు ఎన్టీఆర్ ఇద్దరు కుమార్తెలను కూడా లక్ష్మీపార్వతి తీవ్రంగా విమర్శించారు. తండ్రి ఎన్టీఆర్ కు అవమానం జరుగుతుంటే ఇద్దరు కూతుళ్లు చంద్రబాబుకే సపోర్టు చేశారని, వారు కూతుళ్లుగా అనర్హులని లక్ష్మీపార్వతి అన్నారు.

Related posts

కాంట్రవర్సీ: ట్రాఫిక్ పోలీసులతో సిఎం మేనల్లుడి(?) రభస

Satyam NEWS

సీఎం కేసీఆర్ ప్రకటనపై పివి కుటుంబం ఆనందం

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్ తో ప్రజావాణి కార్యక్రమం రద్దు

Satyam NEWS

Leave a Comment