28.2 C
Hyderabad
May 9, 2024 00: 23 AM
Slider ప్రత్యేకం

సి ఎస్ బి ఐఏఎస్ అకాడమీ జయకేతనం

#CSB IAS

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూ.పి.ఎస్.సి) సివిల్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఈరిజల్ట్స్ లో హైదరాబాద్ లోని “సి.ఎస్.బి ఐఏఎస్ అకాడెమీ”మరోసారి విజయకేతనం ఎగురవేసింది. సివిల్స్ మెంటర్, ఐఏఎస్ మల్లవరపు బాలలత మేడమ్ ఆధ్వర్యంలోని “సిఎస్ బి ఐఏఎస్ అకాడమీ”కి ఈసారి కూడా ర్యాంకులపంట పండింది. ఈఅకాడమీకి గతంకంటే అధికంగా ఈసారి ర్యాంకులు రావడం విశేషం. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం మొత్తం 18 ర్యాంకులను “సిఎస్ బి ఐఏఎస్ అకాడమీ” విద్యార్థులు సాధించారు.

ఈర్యాంకులలో 22, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు వున్నాయి. పూర్తి వివరాలు అందేసరికి ఈర్యాంకులు మరిన్ని పెరిగే అవకాశం వుందంటున్నారు.

డైరెక్టర్ బాలలత పట్టుదల, కృషి, మొక్కవోని దీక్ష, నిర్విరామ శిక్షణ వెరసి సి.ఎస్.బి కి ర్యాంకులను సాధించింది. డైరెక్టర్ బాలలత మేడమ్ చెప్పిన మెళకువలు తమ శిక్షణ సమయంలో ఎంతగానో ఉపకరించాయని టాపర్లు చెప్పారు. బాలలత మేడమ్ అందించిన విలువైన సూచనలు, సలహాల వల్ల సివిల్స్ ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలను సైతం

విజయవంతంగా ఎదుర్కొని తాము ఎంతో సులువుగా ర్యాంకులు సాధించామని విజేతలు ఈసందర్భంగా చెప్పారు. కాగా ప్రతిఏటా ర్యాంకుల పరంపర కొనసాగిస్తూ ఏటికెడు ర్యాంకులు పెంచుకుంటూ పోతున్న సిఎస్ బి అకాడెమీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ర్యాంకర్లు, వారి తల్లితండ్రులు, వారి బంధువులు సి.ఎస్ బి డైరెక్టర్ బాలలత మేడమ్ గారిని అభినందిస్తున్నారు.

సివిల్స్ ఫలితాలు వెల్లడైన ఈసందర్భంగా బాలలత మాట్లాడుతూ జాతీయస్థాయి పరీక్షలలో తెలుగువారు సత్తా చాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ అకాడమీ ద్వారా గత ఏడెనిమిదేళ్ళలో సుమారు 100 మందికి పైగా సివిల్ సర్వెంట్లను దేశానికి అందించడం గర్వకారణంగా వుందని బాలలత మేడమ్ అన్నారు.

రాబోయే రోజులలో మరింతమంది సివిల్ సర్వెంట్లను అందులో ముఖ్యంగా పెద్దసంఖ్యలో తెలుగువారిని దేశానికి అందించడమే లక్షంగా ముందుకెళ్తున్నట్లు బాలలత మేడమ్ చెప్పారు. తమ లక్ష్యసాధనలో సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ బాలలత మేడమ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ర్యాంకులు మరియు ఇతర పూర్తి వివరాలకు హైదరాబాద్ అశోక్ నగర్ లోని “సిఎస్ బి ఐఏఎస్ అకాడమీ”లో సంప్రదించగలరు.

Contact : 8801086644
Contact : 9666884599.
BALALATHA CSB IAS ACADEMY
Ashoknagar
Hyderabad.

Related posts

ఎమ్మెల్యే రోజాపై పెద్దల రాజకీయ కుట్ర

Satyam NEWS

ఈ నెల 18న నందు హారర్ థ్రిల్లర్ ”ఐందవి” విడుదల

Satyam NEWS

గాంధీ విగ్రహం ముందు అమరవీరులకు నివాళులు

Satyam NEWS

Leave a Comment