33.2 C
Hyderabad
May 4, 2024 01: 26 AM
Slider పశ్చిమగోదావరి

అవినీతి అడ్డాగా మారిన తహసీల్దార్ కార్యాలయం

#curruption

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో తహసీల్దార్ సుందర్ సింగ్ విధులు నిర్వహించిన కాలం లో నిబంధనలకు విరుద్ధం గా కొన్ని వందల ఎకరాల ఎసైన్డ్ భూములను మ్యుటేషన్ లు, అదంగల్ కరక్షన్ లు జరిగినట్టు తెలిసింది. ఈ మ్యుటేషన్ ల వ్యవహారం లో సుమారు 70 లక్షల రూపాయలు ముడుపులు చేతులు మారినట్టు వినికిడి.

ఆపీస్ స్టాప్ తో పాటు కొంత మంది వి ఆర్ ఓ ల తో తహసీల్దార్ కి పరిపాలనా పరమైన సమన్వయం లోపించి వారందరిని తహసీల్దార్ దూరం పెట్టినట్టు సమాచారం.ఆయన దూరం పెట్టిన కొంతమంది సిబ్బంది తో పాటు మ్యుటేషన్ పై ళ్లు పై సంతకాలు పెట్టాల్సిన కింది స్థాయి అధికారుల ప్రమేయం కూడా లేకుండా మండలంలో ఒక గ్రామ వి ఆర్ ఏ ని తహసీల్దార్ కార్యాలయం లో పర్సనల్ కంప్యూటర్ ఆపరేటర్ గా ఏర్పాటు చేసుకుని మ్యుటేషన్ ల ప్రక్రియ అంతా ఆ వి ఆర్ ఏ తో చేయిస్తూ ఎకరామ్యుటేషన్కు 25 వేల నుండి 50 వేల రూపాయల వరకు ఆ వి ఆర్ ఏ తో నే వసూలు చేయించినట్టు విశ్వసనీయ సమాచారం.

మండలం లో వందలాది ఎసైన్డ్ భూములను మ్యుటేషన్ లు చేసి రైతుల వద్ద నుండి నేరుగా వి ఆర్ ఏ తో బేర సారాలు చేయించి తహసీల్దార్ చేతులకు అవినీతి మకిలి అంటకుండా లక్షలాది రూపాయలు ముడుపులు వసూలు చేశా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మ్యుటేషన్ ల వ్యవహారం లో ను అదంగల్ కరక్షన్ ల లో బోరు నిర్మాణ అనుమతి పత్రాల మంజూరు లో లీగల్ హెయిర్, పుట్టిన తేదీ సర్టిఫికెట్స్ మంజూరుకు కూడా ఎదుటి వారి అవసరాన్ని తెలుసుకుని పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు కార్యాలయ సిబ్బంది చెప్పుకోవడం విశేషం.

ఈ కార్యాలయం లో పనిచేసే కింది స్థాయి సిబ్బందికి ఎక్కడ వాటాలు ఇవ్వవలసి వస్తుందో ననివారిని పక్కనపెట్టి తహసీల్దార్ కార్ డ్రైవర్ గాను. కంప్యూటర్ ఆపరేటర్ గాను వి ఆర్ ఏ గా మూడు ఉద్యోగాలు చేస్తున్న మల్టిబుల్ ఉద్యోగి తో ముడుపులు వసూలు చేయించినట్టు తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగం గానే విమర్శలు వినిపిస్తున్నాయి.

వి ఆర్ ఏ ని కార్ డ్రైవర్ గా కంప్యూటర్ ఆపరేటర్ గా ఆ వి ఆర్ ఏ కార్యాలయం లో విధులు నిర్వహించడం పై కార్యాలయ ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెదవేగి గ్రామంలో సర్వే నంబర్ 1036/1లో సుమారు 20 ఎకరాల ఎసైన్డ్ భూమిని మ్యుటేషన్ చేసి లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకున్నారని రెవిన్యూ సిబ్బందే ఆరోపిస్తున్నట్టు సమాచారం.

బాపిరాజు గూడెం లో సర్వే నంబర్ 459 లో సుమారు 5 ఎకరాల ఎసైన్డ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళ కొనుగోలు చేశారని తెలిసింది.ఆ మహిళ పేరున ఎసైన్డ్ భూమి మ్యుటేషన్ చేసి లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు రెవిన్యూ సిబ్బందే చెప్పుకోవడం విశేషం. ఈ కార్యాలయం లొనే ఎసైన్డ్ భూముల మ్యుటేషన్ ను అడ్డుకోవలసిన వెలుగు సిబ్బంది ఒకరికి కొంతమంది వి ఆర్ ఓల కి వాటాలు అందించి వారి ని తహసీల్దార్ తన గుప్పెట్లో పెట్టుకున్నట్టు సమాచారం.

బాపిరాజుగూడెం లో ఒక రైతు భూమి లో ఇంకొకరికి పట్టా, ప ట్టా దా ర్ పా స్ బుక్ లు ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో భూమిపై సర్వ హక్కులున్న రైతు ఎదురుతిరగడంతో సమస్య ని తెలుసుకుని మూడో కంటికి తెలియకుండా సమస్యను పరిష్కరించినట్టు సమాచారం.

పెదవేగి మండలం లో కూచింపూడి, రాయన్న పాలెం, కొండలరావు పాలెం, బాపిరాజుగూడెం, రాట్నాల కుంట కొప్పాక, పెడకడిమి, న్యాయంపల్లి జగన్నాడపురం. గ్రామాలలో పెద్ద ఎత్తున ఎసైన్డ్ భూముల మ్యుటేషన్ లు జరిపి అవినీతికి పాల్పడ్డారని సమాచారం.

బోరు సర్టిఫికెట్ ల కు కూడా 25 వేలు చొప్పున ముడుపులు అందుకున్నారని తెలిసింది.తహసీల్దార్ బదిలీ అయ్యారని తెలిసి కొంతమంది రెవిన్యూ సిబ్బంది టపాసులు కాల్చి నంత సంబరపడ్డారనిసమాచారం పెద్ద ఎత్తున ముడుపులు చేజారిన రైతులు ఎవరికి చెప్పుకోలేక చేజారిన ముడుపులు తిరిగి రాబట్టుకునే దారులు వెతుక్కుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ తహసీల్దార్ విధులలో కొచ్చిన నాటినుండి బదిలీ అయిన నాటి వరకు జరిగిన మ్యుటేషన్ లను పరిశీలిస్తే అక్రమ మ్యుటేషన్ లు ఎన్ని జరిగాయో.అదంగల్ కరక్షన్ లు ఎన్ని జరిగాయో జిల్లా అధికారులు విచారణ జరిపితే తెలుస్తుందని కొంత మంది వి ఆర్ ఓ లు అనుకుంటున్నట్టు సమాచారం. పెదవేగి మండలం లో మ్యు టేషన్ లు చేసి ముడుపులు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని వస్తున్న ఆరోపణల పై తహసీల్దార్ సుందర్ సింగ్ ని వివరణ కోరేందుకు ఆయన సెల్ ఫోన్ కు మెట్రో టి వి ఆదివారం సాయంత్రం ప్రయత్నించగా తహసీల్దార్ సుందర్ సింగ్ స్పందించ లేదు.ఈ తహసీల్దార్ అవినీతి పై ఏ సి బి కూడా పలు మార్లు ఆరా తీసినట్టు రెవిన్యూ సిబ్బంది చెప్పుకోవడం విశేషం.

Related posts

కైండ్ హార్ట్: గల్ఫ్ మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

చావ్లా గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీం తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం అప్పీలు

Bhavani

దేశానికి వన్నె తెచ్చే అద్భుతమైన ప్లేయర్లను తయారు చేయాలి

Satyam NEWS

Leave a Comment