27.7 C
Hyderabad
May 15, 2024 04: 35 AM
Slider ప్రత్యేకం

కోటి టన్నుల ధాన్యం సేకరణ

#ajay

ఈ ఏడాది వానకాలం సీజన్‌ ధాన్యం సేకరణ ప్రారంభం కానున్నది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందని,  ఈ సీజన్‌లో 1.51 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, ఇందులో కోటి టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పంట చేతికొచ్చిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా, మిర్యాలగూడ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.  గ్రేడ్‌ ‘ఏ’ రకం క్వింటాల్‌కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040గా మద్దతు ధరను ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని,  కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారన్నారు.  కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఎదురయితే టోల్‌ ఫ్రీ 180042500333, 1967 నంబర్లకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Related posts

రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్: 43 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ రాజు

Satyam NEWS

అనంతపురంలో మహిళా లెక్చరర్ పై హత్యాయత్నం

Bhavani

విమానాన్ని ఆపిన ఎయిర్ ఇండియా పెంపుడు ఎలుక

Satyam NEWS

Leave a Comment