27.7 C
Hyderabad
May 7, 2024 08: 42 AM
Slider సినిమా

దక్ష మూవీ ట్రయిలర్ లాంచ్

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్,తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన మూవీ దక్ష సినిమా టీసర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త విచ్చేశారు. వారి చేతుల మీదుగా మూవీ టీసర్ లాంచ్ చేయడం జరిగింది. తదుపరి ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా రంగానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలలో సినిమా షూటింగ్ లు చేసుకోవడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. యాదాద్రి దేవాలయం, లక్నవరం, రామప్ప రాష్ట్రంలో అనేకమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని సినిమాలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని శ్రీనివాస్ గుప్త అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత తుమ్మలపల్లి రాంసత్యనారాయణ, డైరెక్టర్ రేలంగి నర్సింగరావు, ప్రొడ్యూసర్ తల్లాడ శ్రీనివాస్,కో-ప్రొడ్యూసర్ సాయి కృష్ణ, డైరెక్టర్ వివేకానంద విక్రాంత్,మ్యూజిక్ లలిత కిరణ్,రైటర్ శివ కాకు, నటి, నటులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీనియర్ హీరో సుమన్ ప్రధాన పాత్రలో ఆర్.కె గాంధీ “త్రిష”

Satyam NEWS

ఏపిలో హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర

Satyam NEWS

ఉప్పరపల్లి లో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్!

Bhavani

Leave a Comment