39.2 C
Hyderabad
April 28, 2024 14: 06 PM
Slider అనంతపురం

ఉప్పరపల్లి లో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్!

#Registration

అనంతపురం అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పాటించకుండా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం జరుగుతోంది.

తవ్వే కొద్ది బయటపడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కురుగుంట లో జరిగిన నిషేధిత భూముల వ్యవహారం వెలుగు చూడగా తాజాగా ఉప్పరపల్లి లో కూడా అదే తంతు కొనసాగినట్లు కనిపిస్తోంది. కొందరి కనుసన్నల్లో ఈ వ్యవహారం చాప కింద నీరుగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. అలాంటి భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఒకరిద్దరు డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్ అధికారులకు మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పైకి మాత్రం నిజాయితీగా కనిపిస్తున్నట్టు నటిస్తూనే మధ్యవర్తుల ద్వారా అధికారులు అంతర్గతంగా పనులు చక్కబెట్టుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పాటించి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని రిజిస్ట్రేషన్ అధికారులు ఖాతరు చేసినట్లుగా కనిపించ డం లేదు. ఉప్పరపల్లిలోని భూముల రిజిస్ట్రేషన్ ను ఒకసారి పరిశీలిస్తే అవగతమవుతుంది.

గ్రామంలోని సర్వేనెంబర్ 194/3,194/4 లోని భూమి నిషేధిత భూముల జాబితాలో ఉంది. ఆ మేరకు ఆ శాఖ వెబ్ సైట్ లో కూడా పొందుపరిచారు. మచ్చుకు కొన్ని వివరాలు… 194/3,194/4 లోని స్థలాన్ని 15-11-2022 తేదీన డాక్యుమెంట్ నెంబర్ 14068/2022 తో రిజిస్ట్రేషన్ జరిగింది. అంతేకాక 30-6-2022 తేదీన డాక్యుమెంట్ నెంబర్ 8173/2022 తో మరో రిజిస్ట్రేషన్ జరిగింది. అలాగే 21-6-2022 తేదీన డాక్యుమెంట్ నెంబర్ 7680/2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది…

ఇదిలా ఉండగా చియ్యేడు,సోమల దొడ్డి, నారాయణపురం గ్రామాలలో ఇలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిందా? అనంతపురం నీరు గంటి వీధిలోని ఒక సర్వే నంబరు లోని భూమి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో కోర్టులో ఉన్నట్లు చూపుతోంది. కానీ పలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి.

ఎలా చేశారు? పుట్టపర్తిలోని తసేష్ సింగ్ కు చెందిన భూమి అనంతపురం రూరల్ లో ఎనీ వేర్ కింద రిజిస్ట్రేషన్ జరిగిందా? డాక్యుమెంట్ లోని ఫోటోలు సంతకాలు, భూ యజమానివి కావా? భారీగా ముడుపులు చేతులు మారాయా? ఇలా అన్నీ ప్రశ్నలే మిగిలాయి.

Related posts

నేమ్ చేంజ్:కరోనా వైరస్ కాదు ఇక ఫై కొవిడ్‌-19

Satyam NEWS

ఆన్ డ్యూటీ:బస్సు లోనే గుండె పోటుతో కండక్టర్ మృతి

Satyam NEWS

ఫాక్ట్ ఫైండింగ్: ధాన్యం అమ్మే రైతులకు సౌకర్యాలు లేవు

Satyam NEWS

Leave a Comment